Nara Lokesh : ఛీఛీ ఓట్ల కోసం ఇంత దిగాజారుతావా లోకేష్ !
Nara Lokesh : ఏపీలో రాజకీయాలు చూసుకుంటే రాయలసీమ చాలా కీలకం. రాయలసీమలో ఎక్కువ సీట్లు ఏ పార్టీకి వస్తే ఆ పార్టీ గెలిచినట్టే లెక్క. అందుకే పార్టీలన్నీ రాయలసీమ మీదనే ఫోకస్ పెడుతుంటాయి. రాయలసీమ కోసమే ప్రత్యేకంగా మేనిఫెస్టోను కూడా ప్రకటిస్తుంటాయి. ప్రతిపక్ష టీడీపీ పార్టీ కూడా రాయలసీమ విషయంలో ముందుగానే మేల్కొంది. ఎందుకంటే.. గత ఎన్నికల్లో టీడీపీ గెలుచుకున్న సీట్లు ఎన్ని. రాయలసీమలో ఒక్క చిత్తూరులో కుప్పం సీటు తప్పితే రాయలసీమలో ఎక్కడా టీడీపీకి […]
Nara Lokesh : ఏపీలో రాజకీయాలు చూసుకుంటే రాయలసీమ చాలా కీలకం. రాయలసీమలో ఎక్కువ సీట్లు ఏ పార్టీకి వస్తే ఆ పార్టీ గెలిచినట్టే లెక్క. అందుకే పార్టీలన్నీ రాయలసీమ మీదనే ఫోకస్ పెడుతుంటాయి. రాయలసీమ కోసమే ప్రత్యేకంగా మేనిఫెస్టోను కూడా ప్రకటిస్తుంటాయి. ప్రతిపక్ష టీడీపీ పార్టీ కూడా రాయలసీమ విషయంలో ముందుగానే మేల్కొంది. ఎందుకంటే.. గత ఎన్నికల్లో టీడీపీ గెలుచుకున్న సీట్లు ఎన్ని. రాయలసీమలో ఒక్క చిత్తూరులో కుప్పం సీటు తప్పితే రాయలసీమలో ఎక్కడా టీడీపీకి సీట్లు దక్కలేదు. అన్నింటినీ వైసీపీ స్వీప్ చేసేసింది. అందుకే.. ప్రస్తుతం రాయలసీమలోని కర్నూలు జిల్లాలో పాదయాత్రలో ఉన్న నారా లోకేశ్.. తన నోటికి ఏది వస్తే అది హామీ ఇచ్చేస్తున్నారు.
రాయలసీమ ఓటర్లను టీడీపీ వైపు తిప్పుకోవడానికి మిషన్ రాయలసీమ అంటూ కొత్త చర్చ కార్యక్రమానికి తెరలేపారు. రాయలసీమ ప్రజలను గంపగుత్తగా వంచించడానికా అన్నట్టుగా ఆయన మిషన్ రాయలసీమ చర్చ కార్యక్రమాన్ని నిర్వహించడంపై సర్వత్రా వ్యతిరేకత వస్తోంది. అసలు రాయలసీమ ఇప్పటికీ కరువు సీమగానే ఉండటానికి కారణం ఎవరు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కదా. 14 ఏళ్లు సీఎంగా పనిచేసి చివరకు తన సొంత ప్రాంతానికి గుక్కెడు నీళ్లు ఇవ్వలేకపోయారు. తన సొంత నియోజకవర్గం నుంచి వెళ్లే సాగునీటి కాలువను కూడా పూర్తి చేయలేకపోయారు చంద్రబాబు. సినిమా డైలాగులు చెప్పడం కాదు కదా. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు రాయలసీమను ఆదుకోలేదు అంటూ ప్రజలు మండిపడుతున్నారు.
Nara Lokesh : కియా ఒక్కటి వస్తే చాలా?
మాట్లాడితే కియా పేరు ఎత్తుతారు. ఒక్క కియా వచ్చినంత మాత్రాన ఇక రాయలసీమ అభివృద్ధి చెందినట్టేనా. అది ఒక పరిశ్రమ. ఆ పరిశ్రమ వల్ల కొందరికి ఉపాధి లభిస్తుంది అంతవరకు బాగానే ఉంది. మరి రాయలసీమ రైతుల గురించి ఎందుకు మాట్లాడరు. రాయలసీమ ప్రజలు తమకు ఓట్లేయకున్నా అభివృద్ధి చేశాం అంటూ భుజాలు తడుముకోవడం ఎందుకు లోకేశ్ బాబు. వైసీపీకి ఇచ్చినన్ని సీట్లు ఇస్తే చెప్పింది చేసి చూపిస్తాం అంటావా? 14 ఏళ్ల పాలనలో మీనాన్న చంద్రబాబు ఏం చేశారు. అప్పుడు ప్రజలు గెలిపించారు కదా.. మరి ఎందుకు అప్పుడు అభివృద్ధి చేయలేదు అంటూ నారా లోకేశ్ పై రాయలసీమ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.