Revanth Reddy CM : రేవంత్ రెడ్డి ఎందుకు సీఎం అంటే… !!
ప్రధానాంశాలు:
Revanth Reddy CM : రేవంత్ రెడ్డి ఎందుకు సీఎం అంటే... !!
Revanth Reddy CM : ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో రేవంత్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. సాధారణ మండల స్థాయి నాయకుడిగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి అతి తక్కువ సమయంలోనే జాతీయ పార్టీ రాష్ట్ర సారధి కావడం ఆయనకే చెందింది. ఇప్పటికే రాజకీయాలలో దూకుడికి ఆయన బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ఆయన పేరు చెప్తే గుర్తొచ్చేది ఫైర్ అంబాసిడర్. ఈ తరం రాజకీయాలలో ఆయన ఒక ట్రెండ్. అన్ని వయసుల వారికి ఆయన ఒక ఫ్రెండ్. అలాంటి నేత సారథ్యంలో హస్తం అధికారంలోకి రావడం ఆ పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపుతుంది. ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి పూర్తిస్థాయిలో కాంగ్రెస్ లో అన్ని తానై వ్యవహరించిన రేవంత్ పార్టీని విజయవంతంగా నిలిపారు.
తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని మెజారిటీకి కావలసిన మ్యాజిక్ ఫిగర్ ని సొంతం చేసుకున్నారు. దాదాపుగా అన్ని సర్వేలు తెలిపాయి. పూర్తిస్థాయిలో మెజారిటీ కాంగ్రెస్ సాధిస్తుందని సర్వేలు అంచనా వేశాయి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ గత పది ఏళ్లుగా అధికార కోసం పోరాటం చేస్తూనే ఉంది. అయినా తెలంగాణ ప్రజలు ఆ పార్టీ కోసం గత రెండు ఎన్నికలలో ఆదరించలేదు. ఇక ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ దే అధికారం అని తేలిపోయింది. ఈ క్రెడిట్ మొత్తం రేవంత్ రెడ్డికి వస్తుందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒడ్డుకు చేర్చి పార్టీని నిలబెట్టి ఆయన చేసిన కృషిని అందరూ ప్రస్తావిస్తున్నారు.
ఎగ్జిట్ పోల్స్ లో కూడా రేవంత్ రెడ్డి గెలుపు ఖాయమని చెప్పేశాయి. ఇప్పుడు అదే జరిగింది. అంతర్గత వ్యవహారాలు ఎలా ఉన్నా కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి కృషిని తక్కువ చేసి చూసే పరిస్థితి కూడా లేదు. అనేక విమర్శలు, మాటలతూటాలు ఎదుర్కొన్న రేవంత్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కి ధీటుగా నిలిపారు. సొంత పార్టీల గాడిలో పెట్టుకుంటూ ప్రతిపక్ష పార్టీపై పోరాటం చేశారు. రేవంత్ ఆయన ఎదుర్కొన్న కష్టాలు బీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అని నిలబడటం వంటి వాటిని గుర్తు చేస్తున్నారు. రేవంత్ రాకతోనే కాంగ్రెస్ అధికారంలోకి రావడం సాధ్యమైందని అంటున్నారు. అంతేకాదు పదేళ్ల పాటు కాంగ్రెస్ అధికారం కోసం ఎదురుచూసిన అధికార పీఠం రేవంత్ హయాంలో దొరుకుతుండడం రేవంత్ పట్ల అభిమానాన్ని మరింత పెంచుతుంది.