Chandrababu : చంద్రబాబు కోర్టు మెట్లు కూడా ఎక్కట్లేదు – కారణం ఇదే..!
Chandrababu : రాజకీయాల్లో కోర్టు కేసులు అనేవి కామన్. అది టీడీపీ కావచ్చు.. వైసీపీ కావచ్చు. అధికారంలో ఏ పార్టీ అంటే.. అది ప్రతిపక్ష పార్టీల మీద.. ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వం మీద ఇలా కేసులు అనేవి ఫైల్ అవుతూనే ఉంటాయి. ఇప్పటికే టీడీపీ కూడా చాలా సార్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా కేసులు వేయించింది. ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపట్టింది. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటి వరకు చాలా కేసులు నమోదు అయ్యాయి. అవన్నీ విచారణ చేపట్టిన కోర్టే ఆ విషయాన్ని తెలిపింది. సీఎం జగన్ ఏం చేసినా వెంటనే కేసు వేసే టీడీపీ..
మరి.. ఇటీవల జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో వన్ కి ఎందుకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేయలేదు. జీవో 1 పై వేరే పార్టీలు కూడా కేసు వేస్తామని చెప్పుకొచ్చాయి. జనసేన నాయకుడు నాగబాబు కూడా జీవో వన్ పై కోర్టులో కేసు వేస్తామని చెప్పుకొచ్చారు. అటు చంద్రబాబు, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జీవో వన్ పై సీరియస్ అయ్యారు. ఈ జీవోపై కేవలం సీపీఐ మాత్రమే కోర్టులో కేసు వేసింది. టీడీపీ కానీ.. జనసేన కానీ వేయలేదు. అయితే.. సోషల్ మీడియాలో జీవో వన్ పై టీడీపీ నేతలు, జనసేన నేతలు విపరీతంగా విమర్శల వర్షం కురిపించారు.
Chandrababu : జీవో వన్ పై కేసు వేసిన సీపీఐ
కానీ.. కేసు మాత్రం వేయలేదు. ఈ జీవోపై కోర్టులో కేసు వేసినా అది బెడిసికొడుతుందని.. అది తమకే ఎదురు దెబ్బ అని ముందే వీళ్లకు తెలిసిపోయిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా.. కోర్టులో కేసు వేయడం అంటే మామూలు విషయం కాదు.. పక్కా ఆధారాలు ఉండాలి. ఏదో ఊరికే కేసులు వేస్తే మొదటికే మోసం వస్తుందని ముందే టీడీపీ, జనసేనలకు అర్థం అయి ఉంటుందని తెలుసుకున్నట్టుంది. జీవో వన్ కు ఎందుకు ప్రభుత్వం తీసుకొచ్చిందో కోర్టు విచారణ చేస్తే అసలుకే మోసం వస్తుందని భావించారో ఏమో.. అందుకే టీడీపీ, జనసేన ఈ విషయంలో సైలెంట్ అయిపోనట్టు తెలుస్తోంది.