YSRCP : వైసీపీలో రగులుతున్న చిచ్చు.. ఆర్పడానికి ప్రయత్నించని జగన్? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YSRCP : వైసీపీలో రగులుతున్న చిచ్చు.. ఆర్పడానికి ప్రయత్నించని జగన్?

 Authored By jagadesh | The Telugu News | Updated on :14 April 2021,10:40 am

YS Jagan : ఏపీలో ప్రస్తుతం వైఎస్సార్సీపీలో రగులుతున్న చిచ్చు మీద తెగ చర్చలు జరుగుతున్నాయి. అసలు వైసీపీలో ఏం జరుగుతోంది అనే విషయం ఎవ్వరికీ అర్థం కావడం లేదు. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు చేసే పని వల్ల సీఎం జగన్ కు చాలా ఇబ్బందులు వస్తున్నాయట. అయినా కూడా సీఎం జగన సైలెంట్ గా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. కొన్ని అంశాల్లో సీఎం జగన్ చూసీచూడనట్టుగానే వదిలేస్తున్నారట. ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరును అస్సలు పట్టించుకోవడం లేదట. దాని వల్ల పార్టీకి, తనకు తీవ్రంగా నష్టం జరిగే ప్రమాదం ఉన్నా.. ఎందుకు సీఎం జగన్ అస్సలు ఎమ్మెల్యేల పనితీరు విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు… అనే దానిపై ప్రస్తుతం పెద్ద చర్చ నడుస్తోంది.

why ys jagan neglecting corrupted ycp leaders

why ys jagan neglecting corrupted ycp leaders

ఎందుకంటే… గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కూడా తన ప్రభుత్వ హయాంలో.. టీడీపీ నేతలను పెద్దగా పట్టించుకోలేదు. ఎమ్మెల్యేల పనితీరు విషయంలో, మంత్రుల విషయంలో చంద్రబాబు లైట్ తీసుకున్నారు. కొందరు మంత్రుల వల్ల పార్టీకే కాదు… చంద్రబాబుకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చివరకు టీడీపీ అధికారం కోల్పోయే పరిస్థితి వరకు వచ్చింది. అందుకే… అంత దూరం పరిస్థితి వెళ్లక ముందే ముందే.. పరిస్థితులను చక్కదిద్దుకుంటే బెటర్ అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

YSRCP : చంద్రబాబు చేసిన తప్పే చేస్తున్న జగన్

అప్పుడు చంద్రబాబు ఏదైతే తప్పు చేశారో… ఇప్పుడు జగన్ కూడా అదే తప్పు చేస్తున్నారనే భావన రాజకీయ విశ్లేషకుల్లో కలుగుతోంది. సీఎం జగన్… వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేల విషయంలో కొంచెం సీరియస్ గా ముందుకు వెళ్తేనే సేఫ్ అని… లేకపోతే సీఎం జగన్ తన సమస్యలను తానే కోరి తెచ్చుకున్నట్టు అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీలో ఉండే నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట. నిండ మునిగాక బాధపడటం ఎందుకని.. ముందే తేరుకొని సీఎం జగన్ కు లేఖలు రాయడానికి కూడా కొందరు నేతలు సిద్ధం అవుతున్నారట. క్షేత్రస్థాయి కార్యకర్తలయితే చాలా ఇబ్బందులకు గురవుతున్నారట. ఎమ్మెల్యేల తీరుతో చాలా విసుగు చెందుతున్నారట.

ముఖ్యమంత్రి జగన్… ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించినా… అవి క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. అసలైన లబ్ధిదారులకు చేరడం లేదు. ఒక మంచి సంకల్పంతో జగన్ సంక్షేమ పథకాలను ప్రారంభిస్తే…. కనీసం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లకుండా…. ఎమ్మెల్యేలంతా తమ వ్యాపారాల్లో మునిగి తేలుతున్నారట. కేవలం కార్యకర్తల మీద ఆధారపడి పార్టీని ముందుకు నడిపించాలని చూస్తే… ఎంతకాలం ఇలాంటి వ్యవహారాలు నడుస్తాయి. దీని వల్ల.. సీఎం జగన్ కు, పార్టీకి తీవ్ర నష్టం ఏర్పడబోతోంది కాబట్టి.. కొందరు నేతలు దైర్యం చేసి అయినా ఈ విషయాలు జగన్ కు చేరవేయాలని తెగ ప్రయత్నాలు జరుపుతున్నారట. జగన్ కూడా ఓసారి ఇటువంటి నేతలపై కన్నెర్ర చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది