8th Pay Commission : కేంద్రం గుడ్ న్యూస్.. ఏడో పే కమిషన్ బంద్.. ఎనిమిదో కమిషన్ రాబోతోందా?
8th Pay Commission : ఏడో వేతన సంఘం తెలుసు కదా. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, జీతాల పెంపు, డీఏ పెంపు, డీఆర్, ఇతరత్రా ప్రయోజనాలు అన్నీ ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు కేంద్రం అమలు చేస్తుంటుంది. ఏడో వేతన సంఘం ఏర్పడకముందు ఆరో వేతన సంఘం ఉండేది. దాని ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను జీతాలు ఉండేవి. ప్రస్తుతం ఉన్న ఏడో వేతన సంఘాన్ని ఆపేసి.. ఎనిమిదో వేతన సంఘాన్ని కేంద్రం తీసుకురానున్నదట. నిజానికి.. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వస్తున్న డిమాండే.
చాలాకాలంగా ఎనిమిదో వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆ దిశగా కేంద్రం కూడా ఆలోచిస్తుందని అనుకున్నారు. ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ లోనూ అదే చెబుతారని అనుకున్నారు కానీ.. అలాంటి ప్రకటన ఏదీ కేంద్రం నుంచి బడ్జెట్ లో రాలేదు. దీంతో ఇప్పట్లో 8వ వేతన సంఘం ఉండదేమో అని అనుకున్నారు. మామూలుగా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి కమిషన్ ను మారుస్తుంటారు. ఐదో పే కమిషన్ తర్వాత ఆరో పే కమిషన్.. ఇప్పుడు ఏడో కమిషన్. 2014 లో ఏడో వేతన సంఘం ఏర్పాటు అయింది. ఇంకో సంవత్సరం అయితే 10 ఏళ్లు పూర్తవుతుంది.
8th Pay Commission : 10 ఏళ్లకు ఒకసారి మారుతున్న పే కమిషన్ రూల్స్
2024 లోపు ఏడో వేతన సంఘాన్ని ఆపేసి.. ఎనిమిదో వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలి. అందుకే.. వచ్చే ఏడాదిలోగా ఏడో పే కమిషన్ ను ఆపేసి.. ఎనిమిదో వేతన సంఘాన్ని తీసుకొస్తారని తెలుస్తోంది. ఎలాగూ వచ్చే సంవత్సరం ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో 2024 మొదట్లోనే ఎన్నికలకు ముందే కేంద్రం 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. తద్వారా లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు కేంద్రానికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. 8వ వేతన సంఘం ఏర్పాటు అయితే.. ఉద్యోగుల జీతాలు పెంచడం, బేసిక్ వేతనాన్ని పెంచడం, ఫిట్ మెంట్ పెంపు, ఇతర అలవెన్సులు, డీఏల పెంపుపై ఈ సంఘం కేంద్రానికి సిఫారసులు చేయనుంది.