Bandi Sanjay : బండి సంజయ్, తెలంగాణ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారా.?
Bandi Sanjay : ముఖ్యమంత్రి పదవి మీద ఆశ లేకపోతే, బండి సంజయ్ ఎందుకు పాదయాత్ర చేస్తారు.? ఈ ప్రశ్న బీజేపీలో చాలామంది నేతల్లో వ్యక్తమవుతోంది. బండి సంజయ్‌ని తెలంగాణ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగానే దాదాపు అందూ చూస్తున్నమాట వాస్తవం. తెలంగాణలో బీజేపీకి ఎంత సీన్ వుంది.? అన్నదానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే, అనూహ్యంగా బండి సంజయ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా సత్తా చాటుతున్నారు.. తెలంగాణలో కేసీయార్‌కి ప్రత్యామ్నాయం తానేనని చాటి చెప్పగలుగుతున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ […]
Bandi Sanjay : ముఖ్యమంత్రి పదవి మీద ఆశ లేకపోతే, బండి సంజయ్ ఎందుకు పాదయాత్ర చేస్తారు.? ఈ ప్రశ్న బీజేపీలో చాలామంది నేతల్లో వ్యక్తమవుతోంది. బండి సంజయ్‌ని తెలంగాణ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగానే దాదాపు అందూ చూస్తున్నమాట వాస్తవం. తెలంగాణలో బీజేపీకి ఎంత సీన్ వుంది.? అన్నదానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే, అనూహ్యంగా బండి సంజయ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా సత్తా చాటుతున్నారు.. తెలంగాణలో కేసీయార్‌కి ప్రత్యామ్నాయం తానేనని చాటి చెప్పగలుగుతున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారా.?
ఏమో, చేసినా చేయొచ్చు.అయితే, ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే సంస్కృతి బీజేపీలో లేదంటూ పలువురు బీజేపీ కీలక నేతలు చెబుతున్నారు. మరోపక్క, బండి సంజయ్‌కి వ్యతిరేకంగా బీజేపీలోనే ఓ గ్రూపు నడుస్తోంది. ప్రతిసారీ బండి సంజయ్‌ని ఆ వర్గం వెనక్కి లాగేందుకు ప్రయత్నిస్తున్నమాట వాస్తవం. ఆ గ్రూపు గురించి బీజేపీ అధిష్టానం దగ్గర కూడా ఖచ్చితమైన సమాచారమే వుంది. కానీ, తెలంగాణలో గులాబీ పార్టీని ఎదుర్కోవాలంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న పంచాయితీ బీజేపీలో వుండకూడదు.
ఆ దిశగానే బీజేపీ ఎప్పటికప్పుడు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. నిజానికి ముఖ్యమంత్రి పదవిపై కిషన్ రెడ్డి కన్నేశారన్న వాదన వుంది. కానీ, ఆయన అధిష్టానం ఆదేశాల్ని జవదాటే అవకాశం దాదాపుగా వుండదు. మరోపక్క, సినీ నటి, బీజేపీ నేత విజయశాంతి కూడా ‘నేనూ ముఖ్యమంత్రి అభ్యర్థినే..’ అన్న భావనలో వున్నారట. ఒకవేళ విజయశాంతి గురించి బీజేపీ అధిష్టానం ఆ కోణంలో ఆలోచిస్తే, అది మంచి ఆలోచనే అవుతుంది. కేసీయార్ మీద విజయశాంతి పోటీ అంటే, అది వేరే లెవల్ పబ్లిసిటీ తెచ్చిపెడుతుంది బీజేపీకి. కానీ, విజయశాంతిని అంత తేలిగ్గా నమ్మలేం. ఆమె ఎప్పుడెలా వ్యవహరిస్తారో ఎవరికీ తెలియదు.