YS Jagan : జగన్ కి భారీగా కలిసొచ్చే ఆఫర్.. మళ్ళీ సేఫ్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Jagan : జగన్ కి భారీగా కలిసొచ్చే ఆఫర్.. మళ్ళీ సేఫ్..!!

YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ కు మరో అంశం భారీగా కలిసి రాబోతోంది. ఎందుకంటే.. 2024 ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ అయితే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని తెగ ఆరాటపడుతోంది. కానీ.. టీడీపీ గెలవడానికి చాలా కష్టపడాలి. ఓవైపు వైసీపీ కూడా రెండో సారి అధికారంలోకి రావడానికి అంతకంటే ఎక్కువ కష్టపడుతోంది. కానీ.. వైసీపీకి అన్ని పార్టీల కంటే కూడా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. అదే […]

 Authored By kranthi | The Telugu News | Updated on :1 January 2023,4:00 pm

YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ కు మరో అంశం భారీగా కలిసి రాబోతోంది. ఎందుకంటే.. 2024 ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ అయితే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని తెగ ఆరాటపడుతోంది. కానీ.. టీడీపీ గెలవడానికి చాలా కష్టపడాలి. ఓవైపు వైసీపీ కూడా రెండో సారి అధికారంలోకి రావడానికి అంతకంటే ఎక్కువ కష్టపడుతోంది. కానీ.. వైసీపీకి అన్ని పార్టీల కంటే కూడా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. అదే వైసీపీ పార్టీ అధికారంలో ఉండడం.

ఏపీ సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండటమే ప్రస్తుతం ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్.అందులోనూ ఆయన 2024 బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఏపీలో 2024 మే జూన్ సమయంలో ఎన్నికలు ఉంటాయి. కానీ.. 2024 ఫిబ్రవరి లో ఆ సంవత్సరం బడ్జెట్ ను కూడా వైసీపీ ప్రభుత్వమే ప్రవేశపెట్టబోతోంది. 2023 బడ్జెట్ ను కూడా వైసీపీ ప్రభుత్వమే ప్రవేశపెట్టనుంది. అందుకే 2024 లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఎన్నికల బడ్జెట్ గా మారబోతోంది. అయితే.. 2024 బడ్జెట్ ను పూర్తి స్థాయిలో సీఎం జగన్ ఉపయోగించుకోబోతున్నారు. ఆ బడ్జెట్ లో ఆయన మెరుపులు కురిపించబోతున్నారు.

will be the big advantage to ap cm ys jagan

will be the big advantage to ap cm ys jagan

YS Jagan : ఎన్నికల బడ్జెట్ గా మారనున్న 2024 ఎన్నికలు

అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకే, ఏపీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు పలు పథకాలను జగన్ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే.. బడ్జెట్ లో పలు ప్రాజెక్టులకు డబ్బులు కేటాయించి.. వాటిని పూర్తి చేయడానికి సమయాన్ని జగన్ కోరే అవకాశం ఉంది. ఆ ప్రాజెక్టులు మధ్యలో ఆగకూడదంటే ఖచ్చితంగా మళ్లీ వైసీపీని గెలిపించాలని.. లేకపోతే ఏపీ అభివృద్ధి కుంటుపడటమే కాదు.. మొదలైన ప్రాజెక్టులన్నీ ఆగిపోతాయని వైసీపీ ప్రభుత్వం ప్రజలకు విన్నవించే అవకాశం ఉంది. ఇలాంటి భారీ వ్యూహాలతో సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది