Chandrababu : నలభై ఏళ్లుగా ఎన్నడూ లేనిది.. జగన్ దెబ్బకి చేస్తోన్న చంద్రబాబు
Chandrababu : సీఎం జగన్.. చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని తెలియగానే.. టీడీపీలో ప్రకంపనలు వచ్చాయి. ఇంకా టీడీపీలో ఆ ప్రకంపనలు తగ్గినట్టుగా లేవు. నిజానికి.. కుప్పం నియోజకవర్గం అనేది టీడీపీ కంచుకోట. కానీ.. ఈసారి మాత్రం వైసీపీ పార్టీ కుప్పంపై దృష్టి పెట్టింది. ఎలాగైనా కుప్పాన్ని ఈసారి దక్కించుకోవాలని అధికార పార్టీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఫలితాలు వైసీపీకి అనుకూలంగా ఉండటంతో వైసీపీ అదే జోరుతో ఇంకా కుప్పంలో పాగా వేయాలని ముందుకు వెళ్తోంది.
కుప్పం నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరగని అభివృద్ధిని సీఎం జగన్ చేసి చూపించారు. దాదాపు తన రాజకీయ జీవితంలో 40 ఏళ్లలో చంద్రబాబు చేయలేనిది.. కేవలం మూడేళ్లలో సీఎం జగన్ చేసి చూపించారు. తొలి సారి చంద్రబాబు గడ్డపై ముఖ్యమంత్రిగా అడుగుపెట్టిన జగన్ వైఎస్సార్ చేయూత పథకం కింద రూ.4944.44 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. అలాగే.. ఇతర అభివృద్ధి పనులకు రూ.66 కోట్లతో శంకుస్థాపన చేశారు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రిగా, లేదా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా చంద్రబాబు ఏనాడూ చేయలేదు. దీంతో టీడీపీ ఓటు బ్యాంకుకు అక్కడ ఈ దెబ్బతో దెబ్బ పడుతుందని అంతా భావిస్తున్నారు.
Chandrababu : టీడీపీ ఆత్మరక్షణలో పడిపోయిందా?
కుప్పంపై ఎలాగైనా వైసీపీ జెండా పాతుతామని వైసీపీ నేతలు చెబుతుండటంతో టీడీపీ ఆత్మరక్షణలో పడిపోయిందని తెలుస్తోంది. అందులోనూ కుప్పంలో వైస్ జగన్ సభ కూడా విజయవంతం అయింది. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబుకు మింగుడుపడటం లేదు. తన పార్టీ ఓడిపోయినా పెద్దగా ఆయనపై విమర్శలు రావు కానీ.. సొంత నియోజకవర్గంలో టీడీపీ ఓడిపోతే ఇక చంద్రబాబు రాజకీయాలకు పనికిరారు అనేది ప్రజల్లోకి బలంగా వెళ్లిపోతుందని.. దీని ద్వారా చంద్రబాబు రాజకీయ జీవితమే ముగింపులోకి వచ్చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకే ఈసారి కుప్పంతో పాటు.. మరో నియోజకవర్గంలోనూ పోటీ చేసేందుకు చంద్రబాబు సమాయత్తం అవుతున్నారు.