KCR : ఒకప్పటి రాజకీయాలు వేరు ఇప్పుడు వేరు. ఉమ్మడి ఏపీగా ఉన్న సమయంలో తెలంగాణ ఉద్యమం జోరుగా సాగింది. ఆ సమయంలో ఏపీకి చెందిన ప్రజలను తెలంగాణ నుంచి వెళ్లిపోవాలంటూ టీఆర్ఎస్ పార్టీ గట్టి డిమాండ్ చేసింది. ఆ తర్వాత తెలంగాణ వచ్చింది. కాలం గిర్రున తిరిగింది. తెలంగాణ వచ్చి 10 ఏళ్లు దాటింది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ గా మారింది. బీఆర్ఎస్ పార్టీ కేవలం తెలంగాణకే పరిమితం అయి ఉంటే ఇప్పుడు కేసీఆర్ కు ఇన్ని సమస్యలు వచ్చి ఉండేవి కావు. కానీ.. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దేశమంతా విస్తరించింది. ఏపీలోనూ విస్తరించాలి.
ఏపీలో కేసీఆర్ అడుగు పెట్టాలంటే ఒకసారి గతంలో ఏపీ గురించి, ఏపీ ప్రజల గురించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు తెచ్చుకోవాలి.గతంతో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఆయన ఏపీ ప్రజలపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాటికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రజలపై చేసిన కామెంట్లకు ఇప్పుడు నేను సిగ్గు పడుతున్నాను.. అని కేసీఆర్ ప్రకటించాలి. ఆ తర్వాతే ఆంధ్రాలో అడుగుపెట్టాలన్నారు. అసలు.. బీఆర్ఎస్ పార్టీనే ఏపీ ప్రజలు స్వాగతించరని..
ఏపీ ప్రయోజనాలను దెబ్బతీసిన వ్యక్తి కేసీఆర్ అంటూ జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఎవరైనా రాజకీయాలు చేసుకోవచ్చు. కానీ.. ప్రజలను అవమానించి.. ఇప్పుడు ఏపీకి వచ్చి ఎలా రాజకీయాలు చేస్తారు. ప్రజలను అవమానించిన కేసీఆర్.. ఆంధ్రా ప్రజలకు క్షమాపణ చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. కాదూ కూడదు అంటే కేసీఆర్ ను అడ్డుకొని తీరుతాం అంటూ జీవీఎల్ సీరియస్ అయ్యారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీలో ఎవ్వరూ చేరే పరిస్థితి లేదని.. మా పార్టీ నుంచి వెళ్లిపోయిన కొందరు మాత్రం అందులో చేరారని.. వాళ్లకు, తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని జీవీఎల్ స్పష్టం చేశారు.
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
This website uses cookies.