KCR : కే‌సి‌ఆర్ బ్లాక్ బస్టర్ మాస్టర్ స్కెచ్ .. వర్క్ అవుతుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

KCR : కే‌సి‌ఆర్ బ్లాక్ బస్టర్ మాస్టర్ స్కెచ్ .. వర్క్ అవుతుందా?

KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వ్యూహాలు రచించడంలో ఆయన దిట్ట. ప్లాన్స్ వేయాలంటే.. ప్రతిపక్ష పార్టీని దెబ్బ తీయాలంటే, మాటలతో మాయ చేయాలంటే కేసీఆర్ తర్వాతనే ఎవరైనా. రాజకీయాల్లో ఆయన పండితుడు. ఆయన లెక్కలు కూడా ఎప్పుకేసీఆర్ డూ తప్పలేదు. 2014 నుంచి ఇప్పటి వరకు అప్రతిహాతంగా తెలంగాణను పాలిస్తూ వస్తున్నారు. రెండు సార్లు వరుసగా తెలంగాణలో అధికార పీఠాన్ని అధిరోహించారంటే అది మామూలు విషయం కాదు. ఆ […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :21 August 2022,8:30 am

KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వ్యూహాలు రచించడంలో ఆయన దిట్ట. ప్లాన్స్ వేయాలంటే.. ప్రతిపక్ష పార్టీని దెబ్బ తీయాలంటే, మాటలతో మాయ చేయాలంటే కేసీఆర్ తర్వాతనే ఎవరైనా. రాజకీయాల్లో ఆయన పండితుడు. ఆయన లెక్కలు కూడా ఎప్పుకేసీఆర్ డూ తప్పలేదు. 2014 నుంచి ఇప్పటి వరకు అప్రతిహాతంగా తెలంగాణను పాలిస్తూ వస్తున్నారు. రెండు సార్లు వరుసగా తెలంగాణలో అధికార పీఠాన్ని అధిరోహించారంటే అది మామూలు విషయం కాదు. ఆ ఫలితాల వెనుక ఎన్నో వ్యూహాలు ఉన్నాయి. ప్రస్తుతం కేసీఆర్ కు తెలంగాణలో ఉన్న బద్దశత్రువు బీజేపీ కాదు. కాంగ్రెస్. అందుకే.. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో నామరూపం లేకుండా చేశారు. తెలంగాణను ఇచ్చింది మేమే అని నెత్తి నోరు మొత్తుకుంది కాంగ్రెస్. కానీ.. కాంగ్రెస్ పార్టీని పట్టించుకున్న నాథుడే లేడు. 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడం వెనుక కేసీఆర్ వ్యూహాలు బాగా పనిచేశాయి.

అయితే.. కాంగ్రెస్ ను బలహీనపరచగలిగిన సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ స్థానంలో బీజేపీని బలపరచాలని అనుకున్నారు. ఎందుకంటే.. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కేవలం బీజేపీనే అని పరోక్షంగా ప్రజలు అనుకునేలా చేశారు. కాంగ్రెస్ ను తొక్కడం కోసం బీజేపీని లేపే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనా.. 2018 ఎన్నికల్లో ఆ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో అందరికీ తెలిసిందే. 2023 ఎన్నికల్లోనూ బీజేపీకి సింగిల్ డిజిట్ తప్పితే అంతగా సీట్లు వచ్చే అవకాశం లేదని కేసీఆర్ తెలుసుకున్నారు. అయితే.. ఇటీవల కేసీఆర్ చేయించిన సర్వేల్లో ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని తెలిసింది.

will KCR strategy work this time in telangana

will KCR strategy work this time in telangana

KCR : ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడం కోసం

ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందంటే.. ఆ వ్యతిరేక ఓట్లు చీలిపోవాలి.. ఇదే కేసీఆర్ ప్లాన్. దాని కోసం బీజేపీ పుంజుకోవాలి. కాంగ్రెస్ పడిపోవాలి. కాంగ్రెస్ ఓటు బ్యాంకు పడిపోతే టీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టమేమీ ఉండదు. తెలంగాణలో టీఆర్ఎస్ తర్వాత అధికారంలోకి వచ్చే అవకాశాలు కాంగ్రెస్ కే ఎక్కువగా ఉన్నాయి కానీ.. బీజేపీకి లేవు. అందుకే.. బీజేపీని బలోపేతం చేసి.. కాంగ్రెస్ ను భూస్థాపితం చేసేలా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం కోసమే సీఎం కేసీఆర్ ముందు జాగ్రత్తగా సరికొత్త వ్యూహాలను పన్నుతున్నారు. అవి మరి వర్కవుట్ అవుతాయో లేదో వేచి చూడాల్సిందే.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది