Revanth reddy : సాగర్ లో జానారెడ్డి గెలిస్తే… టీపీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డికే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Revanth reddy : సాగర్ లో జానారెడ్డి గెలిస్తే… టీపీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డికే?

 Authored By jagadesh | The Telugu News | Updated on :18 April 2021,6:31 pm

Revanth Reddy : దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యం చెందింది. దీంతో టీపీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా సమర్పించారు. దుబ్బాక ఉపఎన్నికల్లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతికంగా బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో.. అప్పటి నుంచి కొత్త టీపీసీసీ చీఫ్ పదవి కోసం రేసు ప్రారంభం అయింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్యం ఠాగూర్.. తెలంగాణకు వచ్చి… తదుపరి టీపీసీసీ చీఫ్ గా ఎవరైతే బాగుంటుందని ఆయన తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతల అభిప్రాయం తీసుకున్నారు. అయితే.. టీపీసీసీ చీఫ్ రేసులో చాలామంది పేర్లే వినిపించినా… ఎక్కువగా వినిపించిన పేరు మాత్రం రేవంత్ రెడ్డిదే.

will revanth reddy become tpcc chief if jana reddy wins

will revanth reddy become tpcc chief if jana reddy wins

అవును… తెలంగాణ ఫైర్ బ్రాండ్ అంటే రేవంత్ రెడ్డి. అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించాలన్నా… వాళ్ల విమర్శలకు కౌంటర్ ఇవ్వాలన్నా… కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి తర్వాతనే ఎవ్వరైనా. అందుకే… రేవంత్ రెడ్డి పేరును అధిష్ఠానం కూడా పరిగణనలోకి తీసుకుంది. కానీ… రేవంత్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ కు చెందిన కొందరు నేతలు అడ్డు చెప్పారని… అందుకే టీపీసీసీ చీఫ్ నియామకాన్ని కొన్ని రోజులకు హైకమాండ్ వాయిదా వేసినట్టు తెలుస్తోంది.

అయితే.. తాజాగా మళ్లీ టీపీసీసీ చీఫ్ రేసు మొదలైనట్టు తెలుస్తోంది. నాగార్జున సాగర్ ఉపఎన్నికల ఫలితాల తర్వాత టీపీసీసీ చీఫ్ ను నియమిస్తారని వార్తలు వస్తున్నాయి. సాగర్ ఉపఎన్నిక ప్రచార సమయంలోనే మాణిక్యం ఠాగూర్… టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ వేగవంతం అవుతోందని… సాగర్ ఉపఎన్నిక ఫలితాల తర్వాత ఉంటుందని ఆయన పార్టీ నేతలకు చెప్పడంతో…. మళ్లీ టీపీసీసీ చీఫ్ రేసులో ఎవరుంటారు అనే దానిపై మళ్లీ సందిగ్ధత నెలకొన్నది.

Revanth Reddy : సాగర్ ఉపఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే వరకు టీపీసీసీ చీఫ్ నియామకాన్ని వాయిదా వేయాలన్న జానారెడ్డి

నిజానికి… సాగర్ ఉపఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే వరకు టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియను వాయిదా వేయాలని జానారెడ్డి హైకమాండ్ ను కోరారట. అందుకే… అధిష్ఠానం ఆ ప్రక్రియను వాయిదా వేసిందట. సాగర్ ఉపఎన్నిక ముగియడంతో… మే 2 న ఫలితాలు కూడా వెలువడనున్నాయి. అందుకే… ఇక టీపీసీసీ చీఫ్ పదవి ఎంపిక ప్రక్రియను త్వరలోనే పూర్తి చేసి… కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని హైకమాండ్ ఆలోచిస్తోంది.

అయితే… రేవంత్ రెడ్డితో పాటు… కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జీవన్ రెడ్డి కూడా టీపీసీసీ చీఫ్ పదవి కోసం పోటి పడుతున్నా… ఒకవేళ జానారెడ్డి సాగర్ ఉపఎన్నికల్లో గెలిస్తే… రేవంత్ రెడ్డికి ప్లస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే… సాగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలను రేవంత్ రెడ్డి భుజాన వేసుకున్నారు. ఒకవేళ అక్కడ జానారెడ్డి గెలిస్తే… ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డికే దక్కుతుంది. అందుకే.. జానారెడ్డి కూడా రేవంత్ రెడ్డికే ఓకే చెబుతారని తెలుస్తోంది. అంటే.. జానారెడ్డి సాగర్ ఉపఎన్నికల్లో గెలిస్తే… ఇక రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయినట్టే లెక్క.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది