Diabetes : మటన్ తింటే షుగర్ వస్తుందా? ఇందులో నిజమెంత? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetes : మటన్ తింటే షుగర్ వస్తుందా? ఇందులో నిజమెంత?

 Authored By jagadesh | The Telugu News | Updated on :14 March 2021,9:18 am

Diabetes : ప్రస్తుత జనరేషన్ లో డయాబెటిస్ అనేది ప్రధాన సమస్యగా ఉంది. ప్రతి 10 మందిలో ఐదారుగురికి షుగర్ వస్తోంది. వయసుతో పనిలేకుండా.. అన్ని రకాల వయసు వారికి షుగర్ వస్తోంది. మనిషి జీవన విధానం, ఆహారపు అలవాట్లే షుగర్ వ్యాధికి ప్రధాన కారణాలు అవుతున్నాయి. అయితే.. షుగర్ ను అస్సలు లైట్ తీసుకోకూడదు. షుగర్ ఒక్కసారిగా అమాంతం పెరిగితే.. ప్రాణాలకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది.

will sugar levels increase if we eat mutton

will sugar levels increase if we eat mutton

షుగర్ లేవల్స్ ను కంట్రోల్ లో ఉంచుకోవాలంటే.. ఖచ్చితంగా జీవన విధానాన్ని మార్చుకోవాలి. ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు చేయాలి. ఖచ్చితంగా రోజూ వ్యాయామం చేయాలి. కొలెస్టరాల్ ను నియంత్రణలో ఉంచుకోవాలి.

షుగర్ వ్యాధి ఉన్న వాళ్లకు చెడు కొలెస్టరాల్ శరీరంలో ఎక్కువగా పేరుకుపోతే లేనిపోని సమస్యలు వస్తాయి. చెడు కొలెస్టరాల్ అంటే.. ఎల్డీఎల్, ట్రై గ్లిజరాయిడ్స్. ఇవి షుగర్ వ్యాధి ఉన్నవాళ్ల శరీరంలో ఎంత తక్కువగా పేరుకుపోతే.. అంత బెటర్.

ఒకవేళ.. ఎల్డీఎల్ కొవ్వు ఎక్కువగా ఉంటే.. షుగర్ ఉన్నవాళ్లకు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే.. ఎల్డీఎల్ కొవ్వును షుగర్ ఉన్న వాళ్లు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అలాగే.. ట్రై గ్లిజరాయిడ్స్ ను కూడా తగ్గించుకోవాలి.

Diabetes : చెడు కొలెస్టరాల్ ఎక్కువ ఉన్నవాళ్లు మటన్ తగ్గించుకోవాలి

షుగర్ తో బాధపడుతూ.. చెడు కొవ్వు ఎక్కువగా ఉంటే.. వాళ్లు ఖచ్చితంగా మటన్ తినడం తగ్గించాలి. రెడ్ మీట్, పొట్టేలు మాంసం, మేక మాంసాన్ని తగ్గించాలి. షుగర్ ఉన్నవాళ్లు తినే ఆహారంలో ఎక్కువ మోతాదులో పీచు పదార్థం ఉండాలి కానీ.. కొవ్వు ఉండకూడదు. మటన్ లో ఎక్కువ కొవ్వు ఉంటుంది. అది షుగర్ లేవల్స్ ను అమాంతం పెంచుతుంది.

will sugar levels increase if we eat mutton

will sugar levels increase if we eat mutton

ఒకవేళ మటన్ తినాలనిపిస్తే.. కొద్దిగా కొవ్వు లేకుండా.. చాలా రోజులు గ్యాప్ ఇచ్చి తీసుకుంటే బెటర్. అదేపనిగా.. రోజూ మటన్ తింటే మాత్రం ఖచ్చితంగా షుగర్ లేవల్స్ పెరిగి.. ప్రాణాలకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

Diabetes : కొలెస్టరాల్ కంట్రోల్ కోసం మాత్రలు కూడా వాడొచ్చు

షుగర్ ఎక్కువగా ఉన్నవాళ్లు.. ఒంట్లో ఉన్న కొవ్వును కంట్రోల్ లో ఉంచుకోవడం కోసం.. డాక్టర్ల సలహాతో మాత్రలు కూడా వాడొచ్చు. కొలెస్టరాల్ కంట్రోల్ కు డాక్టర్లు కొన్ని మెడిసిన్స్ ను సూచిస్తుంటారు. ఎక్కువగా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ ఉన్నవాళ్లకు, 40 ఏళ్ల పైబడిన వాళ్లకు.. డాక్టర్లు ఈ మాత్రలను సూచిస్తుంటారు. కాబట్టి.. డాక్టర్లను సంప్రదించి.. దానికి సంబంధించిన మెడిసిన్స్ ను వాడితే బెటర్.

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది