BJP + Janasena : టీడీపీ కి షాక్.. బీజేపీ + జనసేన కలిసి అధికారం కోసం
BJP + Janasena : ఏపీలో సాధారణ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అయినా ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలపై సమాయత్తం అవుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ దేనితో జతకడుతుందో తెలియదు. ఏ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందో తెలియదు. టీడీపీ, జనసేన రెండు పార్టీలు మాత్రం కలిసి పోటీ చేస్తాయని తెలుస్తోంది. కానీ.. అది కన్ఫమ్ అవడానికి ఇంకా సమయం పడుతుంది. టీడీపీ, జనసేన కాదు.. మాతో జనసేన కలిసి పోటీ చేయబోతోంది అంటూ బీజేపీ చెబుతోంది.
ఏది ఏమైనా.. ఒక్క వైసీపీ తప్పితే మిగితా పార్టీలు ఏదో ఒక పార్టీతో జతకట్టాల్సిందే. లేకపోతే ఏపీలో గెలిచే చాన్సెస్ చాలా తక్కువ.వచ్చే ఎన్నికల్లో తమ పార్టీతో జనసేన జతకడుతుంది. రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్నే ఏర్పాటు చేస్తాయని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీతో పాటు ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూడా హిందూ వ్యతిరేక పార్టీలని ఆయన విమర్శించారు. బీజేపీ ప్రజాపోరు నిరసన కార్యక్రమంలో సునీల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
BJP + Janasena : వైసీపీ, టీడీపీ రెండూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయి
అధికార పార్టీ వైసీపీ, టీడీపీ ఈ రెండు పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని సునీల్ దేవధర్ విమర్శించారు. గుంటూరు జిల్లా కొత్తపేటలో నిర్వహించిన బీజేపీ ప్రజాపోరులో పాల్గొన్న ఆయన జగన్ ప్రభుత్వం అన్నింటిలోనూ విఫలమైందంటూ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు స్టిక్కర్స్ అంటించుకొని రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలంటూ ప్రచారం చేస్తోందంటూ సునీల్ దేవధర్ ఆరోపించారు. అధికార వైసీపీ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ ఈ రెండు పార్టీలు టు బ్యాంకు రాజకీయాలను మానుకోవాలని సునీల్ దేవధర్ సూచించారు.