Post Office : నామిని లేకుండా పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు ఇస్తారా..? ఎలాంటి నియమాలు ఉంటాయి…!
Post Office : దేశంలో పోస్ట్ ఆఫీస్ లో కస్టమర్లు కోట్లాదిమంది ఉన్నారు. అయితే ఏదైనా అకౌంట్ తీయాలి అనుకుంటే దాంట్లో నామిని నీ చేర్చడం చాలా ముఖ్యం. పోస్ట్ ఆఫీస్లు మరింత అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఉపయోగదారులకు అన్ని విధాల సేవలను అందిస్తున్నారు. ఇంతకుముందు కేవలం ఉత్తరాలకి పరిమితమైన ఈ ఆఫీసులు ఇప్పుడు అన్ని రకాల స్కీములు సేవలు ప్రజలకు అందిస్తున్నారు. పోస్ట్ ఆఫీస్ లో సేవింగ్స్ అకౌంట్ తీసి చేసే టైం లో కస్టమర్లు నామిని అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకనగా ఏదైనా కారణంగా కస్టమర్ అకాల మరణం పొందితే అలాంటి సమయంలో ఆకౌంట్లో జమ చేసిన ధనం నామినీకి ఇస్తారు.
అయితే ఇటువంటి పామ్ ను పూరించాల్సి వచ్చినప్పుడు కస్టమర్లు నామినీని కూడా నింపడం అస్సలు మరవద్దు. కొన్నిసార్లు గుర్తించినట్లు పోస్ట్ ఆఫీస్ అధికారులు తెలియజేస్తున్నారు. తదుపరి డబ్బు క్లెయిమ్ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది నామిని ని పెట్టకపోతే… ఐదు లక్షల కన్నా ఎక్కువ ఉంటే ఏం చేయాలి.? మీ అకౌంట్లో 5 లక్షల కన్నా ఎక్కువ ఉంటే మీ వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించడం చాలా అవసరం. ఈ ధ్రువీకరణ ద్వారా మీ ఆకౌంటు దారునికి నిజమైన వారుసుడని అర్థమవుతుంది. దీని తదుపరి మీరు పైన చెప్పిన మిగిలిన పత్రాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆకౌంట్లో జమ చేసిన డబ్బులకు క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ లో నామిని లేకుంటే ఐదు లక్షల లోపు డబ్బులకి ప్రత్యేక నిబంధన పెట్టారు. దీని ప్రకారంగా ఎవరైనా అకౌంట్లో 5 లక్షల లోపు డబ్బులు ఉంచి అకాల మరణం పొందితే ఆకౌంటు దారిని మరణ సర్టిఫికెట్ పత్రాన్ని పోస్ట్ ఆఫీస్ లో ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా క్లెయిమ్ ధ్రువీకరణ పత్రాన్ని క్రాస్ చెక్ చేయబడుతుంది. ఆ తదుపరి మీరు క్లెయిమ్ ధ్రువీకర పత్రాన్ని పూరించాల్సి ఉంటుంది. ఆ తరువాత నష్టపరిహారం అఫీడేవిడ్, కేవైసీ ధ్రువీకరణ ఇతర వివరాలతో పాటు కొన్ని సర్టిఫికెట్లను ఇవ్వాల్సి ఉంటుంది. దీని మూలంగా మీ అన్ని సర్టిఫికెట్లను తనిఖీ చేస్తారు. అధికారులు. మీ క్లెయిమ్ ఫామ్ ను క్రాస్ చెక్ చేయబడుతుంది. ఆ తదుపరి మీరు క్లెయిమ్ చేస్తారు దీనిని 6 నెలల లోపే చేసుకోవచ్చు…