Post Office : ఈ పోస్ట్ ఆఫీస్ పథకానికి ఫుల్ డిమాండ్.. భారీగా జాయిన్ అవుతున్న ప్రజలు.. 5 లక్షలకు పైగా లాభం!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Post Office : ఈ పోస్ట్ ఆఫీస్ పథకానికి ఫుల్ డిమాండ్.. భారీగా జాయిన్ అవుతున్న ప్రజలు.. 5 లక్షలకు పైగా లాభం!!

Post Office : పోస్ట్ ఆఫీస్ అంటే ఉత్తరాలను పంపించడం, అందుకోవడం లాంటివి చేసేవారు మొదట్లో. కానీ ప్రస్తుతం ఈ పోస్ట్ ఆఫీస్ ఎన్నో పథకాలతో ప్రజల ముందుకు వస్తుంది. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న చిన్న సేవింగ్ పథకం పోస్ట్ ఆఫీస్ లో లభిస్తున్నాయి. అందరూ వాళ్లకి ఇష్టమైన పథకంలో జాయిన్ అవ్వచ్చు. అయితే వారి లక్ష్యాలు, అవసరాలు ఈ పథకం ప్రాతిపదికన ఎంపిక కూడా మారవచ్చు అని గుర్తుంచుకోవాలి. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ పథకం కూడా […]

 Authored By aruna | The Telugu News | Updated on :10 August 2022,6:00 pm

Post Office : పోస్ట్ ఆఫీస్ అంటే ఉత్తరాలను పంపించడం, అందుకోవడం లాంటివి చేసేవారు మొదట్లో. కానీ ప్రస్తుతం ఈ పోస్ట్ ఆఫీస్ ఎన్నో పథకాలతో ప్రజల ముందుకు వస్తుంది. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న చిన్న సేవింగ్ పథకం పోస్ట్ ఆఫీస్ లో లభిస్తున్నాయి. అందరూ వాళ్లకి ఇష్టమైన పథకంలో జాయిన్ అవ్వచ్చు. అయితే వారి లక్ష్యాలు, అవసరాలు ఈ పథకం ప్రాతిపదికన ఎంపిక కూడా మారవచ్చు అని గుర్తుంచుకోవాలి. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ పథకం కూడా ఇందులో ఒకటి. అయితే ప్రస్తుతం మనం ఈ స్కీం గురించి వివరాలు తెలుసుకుందాం. ఎందుకనగా ఈ పథకంలో జాయిన్ అయ్యే వారి సంఖ్య భారీగా పెరిగిపోతుంది. అదేవిధంగా ఈ పథకం వల్ల ఎటువంటి లాభాలు పొందవచ్చు. ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ పథకం కేవలం సీనియర్స్ కి ఇది అందుబాటులో ఉన్నది. ఇది 2013 _14 నుండి 2021, 22 మధ్య లో ఈ పథకం స్థూల డిపాజిట్లు విలువ భారీగా 1527% పెరిగింది. అయితే ఈ చిన్న సేవింగ్ పథకం గ్రాస్ డిపాజిట్లు విలువ 2013, 14 లలో 1997 కోట్లుగా ఉండేది. 2021 22 రోజుకి దీని విలువ భారీగా 32,507 కోట్లకు వరకు చేరుకుంది. అయితే ఈ సేవింగ్స్ స్కీం లో జాయిన్ అవ్వడం వలన మంచి వడ్డీని అందుకోవచ్చు. మీ తెలివితేటలు ఉపయోగించుకొని ఈ పథకం గుండా ప్రతి మంత్ లాభాలను పొందవచ్చు. ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ పథకంపై వడ్డీ మూడు మాసాలకి ఒకసారి మారుతూ ఉంటాయి. అందుకే కొన్ని ఏళ్ల నుంచి ఈ పథకంపై వడ్డీ పటిష్టంగానే వస్తుంది. కేంద్రం వడ్డీని లోఎటువంటి మార్పులు చేయడం లేదు.

With This Post Office Scheme You can Earn 5 Lakhs Profit

With This Post Office Scheme You can Earn 5 Lakhs Profit

ఈ పథకం వలన కలిగే ఐదు ప్రయోజనాలు:
1) టాక్స్ బెనిఫిట్ అందుకోవచ్చు. ఒక ఆర్థిక ఇయర్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ పథకం గుండా అందుకున్న 50వేల వరకు వడ్డీ పై ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. 50 వేల రూపాయల మినహాయింపు క్రాస్ చేస్తే ఆ టైంలో టాక్స్ చెల్లించాలి. అప్పుడు టీడీఎస్ కట్ చేయబడుతుంది.

2) ఆటో క్రెడిట్ అందుబాటులో ఉంది అంటే సీనియర్ సిటిజన్ వడ్డీ డబ్బు కోసం పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్లవలసిన అవసరం లేదు. ఈ సేవింగ్స్ ఖాతాలో డబ్బులు వాటంతట అవే జమ అవుతాయి. అయితే 60 ఏళ్ల వయసు ఉన్నవారు ఈ పథకంలో చేరవచ్చు.

3) 60 సంవత్సరాల పైబడిన వారు పొదుపు చేసుకునే పథకంపై ఆకర్షణీయమైన వడ్డీని పొందవచ్చు. అలాగే 7.4% వడ్డీ లభిస్తుంది. పి పి ఎఫ్ పథకం కన్నా దీని వడ్డీ ఎక్కువే. ఈ పథకం మెచ్యూరిటీ సమయం ఐదు సంవత్సరాల తదుపరి మూడు సంవత్సరాలు పొడిగించుకోవచ్చు.

4) ఈ పథకంలో చేరిన వారు ప్రతి మూడు మాసాలకి ఒకసారి వడ్డీ పైసలను అందుకోవచ్చు. పదివేలపై ప్రతి క్యార్టర్ 185 రూపాయల వడ్డీ పొందవచ్చు. ఇది డిపాజిట్ చేసి అంతా ప్రాతి పదికన మీకు వచ్చే లాభం కూడా ఆధారపడి ఉంటుంది.

5) అదేవిధంగా దీనిలో ఎంతవరకు పెట్టుబడి ఎక్కువగానే ఉంటుంది. ఈ సీనియర్ సిటిజన్స్ పథకం కింద 15 లక్షల వరకు కట్టుకోవచ్చు. దాదాపు డిపాజిట్ విలువ వేయగా నిర్వహించారు. అనగా 15 లక్షల పెట్టుబడి పెడితే మీకు ప్రతి క్యార్టర్ సుమారు 28000 పొందవచ్చు అంటే ఐదు సంవత్సరాలలో 5.5 లక్షల రాబడి పొందవచ్చు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది