Self Business Ideas : అల్లికలతో బొమ్మలు తయారుచేసి ఏడాదికి రూ.14 లక్షలు సంపాదిస్తున్న మహిళ
Self Business Ideas : ఆ మహిళలకు అల్లికలు అంటే ఇష్టం. దారం కనబడితే చాలు.. దానితో ఏదైనా ఒక బొమ్మను అవలీలగా అల్లేస్తుంది. ఏదో టైమ్ పాస్ కు నేర్చుకున్న ఆ స్కిల్ ఇప్పుడు తనకు ఉపాధి చూపిస్తుందని ఆమె కలలో కూడా అనుకోలేదు. ఆమె ఎవరో కాదు కంచన్ భదాని. తన వయసు 60 కి పైనే. కానీ.. ఇప్పుడే తను ఒక ఎంట్రీప్రెన్యూర్ అయింది. తన కాళ్ల మీద నిలబడింది. అల్లికలతో బొమ్మలు చేస్తూ దాన్నే ఉపాధిగా మార్చుకొని సంవత్సరానికి రూ.14 లక్షలు సంపాదిస్తోంది. జార్ఖండ్ కి చెందిన కంచన్ ఇప్పుడు
అల్లికలతో బొమ్మలు తయారు చేస్తూ అక్కడ ఫేమస్ అయిపోయింది. ఆ బొమ్మలు జనాలకు బాగా నచ్చుతుండటంతో ఇక ఆ వర్క్ మీదనే పూర్తిగా దృష్టి పెట్టింది కంచన్. ఇప్పటి వరకు తను నేర్చుకున్న ఈ స్కిల్ ను 50 మంది గిరిజన మహిళలకు కూడా నేర్పించింది. లూప్ హూప్ అనే కంపెనీని స్థాపించి 2021 నుంచి ఇప్పటి వరకు 3 వేలు బొమ్మలు అవి కూడా చేతితో అల్లిన బొమ్మలే. వాటిని అమ్మింది. ఆర్ట్ అంటే తనకు చాలా ఇష్టం. కోల్ కతాలో పుట్టి పెరిగిన కంచన్ తన కుటుంబ సభ్యులు తన చిన్నప్పుడు వస్త్రాల మీద కుట్లు, అల్లికలు వేయడం చూసి నేర్చుకుంది.
Self Business Ideas : ఆర్ట్ అంటే కంచన్ కు చాలా ఇష్టం
దాన్ని ఏదో సరదాగా నేర్చుకున్నా.. తన 60 ఏళ్ల వయసులో అదే ఉపాధిగా మారింది. 2021 లో తన బాధ్యతలన్నీ తీరాక.. తను నేర్చుకున్న ఆ స్కిల్ కు పది మందికి నేర్పించింది. తన పిల్లలే కంపెనీ ఏర్పాటుకు తోడ్పాడునందించారు. వెబ్ సైట్ కూడా ఏర్పాటు చేశారు. చాలామంది గిరిజన మహిళలకు, యువతలకు ఈ పని నేర్పించడంతో వాళ్ల రోజుకు రెండు మూడు గంటలు కష్టపడ్డా నెలకు రూ.5 వేల వరకు సంపాదించుకోగలుగుతున్నారు. ఇప్పటి వరకు కంచన్ 3 వేలకు పైగా బొమ్మలు అమ్మి లక్షలు సంపాదించింది. సంవత్సరానికి రూ.14 లక్షల ఆదాయం పొందుతోంది కంచన్.