ఆన్‌లైన్‌లో రూ.300 కోసం 2 లక్షలు మోసపోయిన మహిళ
హైదరాబాద్ చెందిన మహిళ ఓ కొరియర్ సంస్థ చేతిలో మోసపోయింది. రూ 300 కోసం తను 2 లక్షలు పోగొట్టుకుంది. ఆ మహిళ తనకు జరిగిన మోసాన్ని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఉషారాణి ఆన్‌లైన్‌లో ఓ వస్తువు బుక్ చేసింది. అయితే వస్తువు తీసుకోచ్చిన కొరియర్ బాయ్ ఆ కొరియర్ ఇచ్చి ఉషారాణి వద్ద తనకు రావాల్సిన దాని కన్నా రూ 300 ఎక్కువ తీసుకోని వెళ్లిపోయాడు.
కొరియర్ సంస్థ ఉద్యోగి భారీ మోసం..
దీంతో ఉషారాణి ఆ కొరియర్ సంస్థకు సంబదించిన కాల్ సెంటర్‌కి ఫోన్ చేసింది. ఆ కొరియర్ సంస్థ ఉద్యోగి ఉషారాణి ఆమయకత్వాన్ని అదునుగా తీసుకొనొ భారీ మోసానికి పాల్పడ్డాడు. అయితే ఆ ఉద్యోగి రూ.300 మీ అంకౌంట్‌లో వేస్తామని దాని ముందు మీరు మీ అకౌంట్ వివరాలు పంపాల్సింగా ఉషారాణి కి సూచించాడు. మీ అటౌంట్ వివరాలు మేము పంపే అప్లికేషన్ ఫిల్ చేసి పంపించాల్సిందిగా ఆ ఉద్యోగి ఉషారాణికి సూచించాడు.
అతని మాటలు నిజమే అనుకొని ఉషారాణి అలానే చేసింది. తర్వాత ఉషారాణి అకౌంట్ నుండి రూ.91 వేలు డిపాజిట్ అయ్యాయి. ఉషారాణి తన అకౌంట్ నుండి డబ్బులు భారీగా కట్ అవ్వడంతో షాక్ గురై మరో సారి ఆ కొరియర్ సంస్థకు కాల్ చేసింది. ఆ సంస్థ ఉద్యోగి ఉషారాణితో మీ వివరాలు తప్పుగా ఎంట్రీ చేశారు మరో సారి కరెక్ట్ చేసి పంపండి అన్నాడు. ఉషారాణి మళ్లీ అలానే చేసింది దీంతో మరోసారి రూ.99 వేలు అకౌంట్ నుండి మళ్లీ కట్ అయ్యాయి. దీంతో ఆ మహిళ ఖాతాలో రెండు సార్లు రూ 1.90 వేలు మోసపోయింది. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.