YS Jagan : జగన్ కి సంబంధించిన అతిపెద్ద కేసులో.. అడ్డంగా బుక్ అయిన వైసీపీ ఎమ్మెల్యే..!
YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఆయన ముఖ్యమంత్రి కాకముందు నమోదైన ఆ కేసు విషయంలో చాలా రోజుల నుంచి జగన్ విచారణకు హాజరవుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రిగానూ ఆయన విచారణకు హాజరవుతున్నారు. ఈనేపథ్యంలో ఆయన కేసులో వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కు షాక్ తగిలినట్టయింది. ఎందుకంటే.. ఆయనకు తెలంగాణ హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా వచ్చింది.
ఇందూ హౌసింగ్ బోర్డ్ తో హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులో వసంత వెంకట కృష్ణ పలు అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టులో వైవీ సుబ్బారెడ్డితో పాటు కృష్ణ ప్రసాద్ భాగస్వాములుగా ఉన్నారు. అయితే.. వసంత ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో ఉన్న ఈ ప్రాజెక్టులో ఒప్పందాలకు విరుద్ధంగా వ్యవహరించారని.. అక్రమ లబ్ధి పొందారని సీబీఐ గతంలోనే అభియోగం మోపింది.
YS Jagan : వసంత ప్రాజెక్ట్స్ సంస్థ పిటిషన్లపై తీర్పు వెల్లడించిన చీఫ్ జస్టిస్
అయితే.. తమపై నమోదైన కేసును కొట్టివేయాలని వైసీపీ ఎమ్మెల్యే పిటిషన్ దాఖలు చేశాడు. ఆ కేసుపై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ దానికి సంబంధించి తాజాగా తీర్పు వెల్లడించారు. ఇప్పటికే సీబీఐ కోర్టులో దీనిపై విచారణ ప్రారంభం అయింది కాబట్టి.. సీబీఐ కోర్టు ఎలాంటి తీర్పు వెలువరించకముందే హైకోర్టు ఎలా తీర్పు చెబుతుందని తెలిపింది. అందుకే.. హైకోర్టులో వసంత కృష్ణకు చుక్కెదురైంది. తాజాగా నమోదైన క్వాష్ పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టేసి.. సీబీఐ కోర్టే దీనిపై తేలుస్తుందని స్పష్టం చేసింది.