Kotamreddy Sridhar Reddy : ఎన్ కౌంటర్ అంటూ…వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!
Kotamreddy Sridhar Reddy : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం సంచలనంగా మారింది. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని.. అనుమానిస్తున్నారని.. ఈ రీతిగా అవమానించిన చోట ఉండే ప్రసక్తి లేదని ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ ప్రభుత్వ పెద్దలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలో వైసీపీ పార్టీకి చెందిన నాయకులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. అది కావాలని రికార్డ్ చేయించుకుని పార్టీపై బురద జల్లే ప్రయత్నానికి కోటంరెడ్డి పాల్పడుతున్నట్లు వివరణ ఇచ్చారు.
చంద్రబాబు దర్శకత్వంలో కోటంరెడ్డి నటిస్తున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాదు కోటంరెడ్డి పార్టీని విడిచి వెళ్లిపోవాలి అని అనుకుంటే వెళ్ళిపోవచ్చు. అంతేగాని… లేనిపోని ఆరోపణలు చేయడం దారుణమని కొంతమంది నేతలు కౌంటర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఈరోజు ఉదయం మీడియా సమావేశం నిర్వహించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను ఏ నిమిషమైనా అరెస్టు చేసుకోండి. శాశ్వతంగా జైల్లో పెట్టండి. కేసులు పెట్టి మీరు అలసిపోవాలి తప్ప..

YCP MLA Kotamreddy Sridhar Reddy comments
నా గొంతు ఆగే ప్రశ్న లేదు. నా గొంతు ఆగాలంటే ఒకటే పరిష్కారం.. ఎన్ కౌంటర్ చేయించండి అని వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అధికారులు మాత్రమే కాదు ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ సలహాదారుడు సజ్జన రామకృష్ణారెడ్డి పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై మండిపడ్డారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.