Perni Nani : నిఖార్సయిన రాజకీయ నాయకుడు చిరంజీవి… పేర్ని నాని షాకింగ్ వ్యాఖ్యలు వైరల్

Authored By Jagadesh Gatla | The Telugu News | Published on: September 19, 2022, 10:00 pm

Perni Nani : తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ అంటే చిరంజీవి. చాలా ఏళ్ల పాటు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోగా వెలుగొందారు. ఇప్పటికీ ఇంకా తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ గానే వెలుగొందుతున్నారు. ఈ వయసులో కూడా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు చిరంజీవి. అది ఆయన సినిమా చరిత్ర. కానీ.. ఒకసారి చిరంజీవి రాజకీయాలను తీసుకుంటే కూడా ఒక చరిత్రే. ఎందుకంటే పార్టీ పెట్టిన వెంటనే ఎన్నికలకు వెళ్లి ఏ పార్టీలు సాధించలేని సీట్లను గెలుచుకున్నారు.

ఈనేపథ్యంలో చిరంజీవి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని. చిరంజీవి నిఖార్సయిన రాజకీయ నాయకుడు అని పేర్ని నాని కొనియాడారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన పేర్ని నాని.. చిరంజీవి గురించి ఏం మాట్లాడారో ఆయన మాటల్లోని విందాం రండి.

YCP MLA Perni Nani comments on Chiranjeevi

YCP MLA Perni Nani comments on Chiranjeevi

Perni Nani : మళ్లీ రాజకీయాల జోలికే రాని చిరంజీవి

నిజంగా నిఖార్సయిన రాజకీయ నాయకుడు అంటే చిరంజీవి గారు. పార్టీ పెట్టారు. 294 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీకి పెట్టారు. పోరాటం చేశారు. 18 సీట్లు ప్రజారాజ్యానికి గెలిపించుకోగలిగారు. తను గెలిచారు. ఆయనకు అనిపించి ఉండొచ్చు.. ఈ రాజకీయాలు నాకు అనవసరం.. నేను సూట్ అవను అనిపించి ఉండొచ్చు. మంచి నిర్ణయం అందరం తీసుకుందాం అని కార్యకర్తలను అడిగారు. అభిప్రాయ సేకరణ చేశారు. అందరూ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేద్దామన్నారు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత మళ్లీ ఎంత మంది ఒత్తిడి చేసిన రాజకీయాల జోలికి రాలేదు. ఆయన యధావిథిగా కాలక్షేపం కోసం తన సినిమా నటన ఏదైతే ఉందో దాన్నే కొనసాగిస్తున్నారు.. అని చిరంజీవి గురించి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు.. పేర్ని నాని ఇప్పుడు చిరంజీవి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు. ఏపీలో చిరంజీవి అభిమానుల మద్దతు కోసం ఇలా పేర్పి మాట్లాడుతున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా.. చిరంజీవి గురించి ఇంత గొప్పగా పేర్ని నాని చెప్పడం చూసి చిరంజీవి అభిమానులు మాత్రం చాలా సంతోషిస్తున్నారు.

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp