Perni Nani : పేర్ని నాని సంచలన నిర్ణయం.. రాజకీయలకు గుడ్‌బై?
Perni Nani : ఏపీ మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారా? రాజకీయాలకు ఆయన గుడ్ బై చెప్పబోతున్నారా? అంటే ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పడం కాదు.. ఆయన వారసుడిని రాజకీయంగా ఎదిగేలా చేయాలని భావిస్తున్నారట. పేర్ని నాని కొడుకు పేర్ని కిట్టూను రాజకీయంగా యాక్టివ్ చేసి తాను రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని, రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలని పేర్ని నాని భావిస్తున్నారట. ప్రస్తుతం పేర్ని నాని ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు.
రెండేళ్ల పాటు ఏపీ మంత్రిగానూ వ్యవహరించారు. ప్రస్తుతం పేర్నికి వచ్చిన సమస్య ఏం లేదు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనకు టికెట్ కన్ఫమ్ అయినట్టే కానీ.. తన కొడుకు పేర్ని కృష్ణమూర్తికి రాజకీయ భవిష్యత్తు ఇవ్వడం కోసం పేర్ని నాని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి కృష్ణా, గుంటూరు యువజన విభాగం అధ్యక్షుడిగా పేర్ని నాని కొడుకు పేర్ని కిట్టు అలియాస్ కృష్ణమూర్తిని నియమించారు. అంటే.. ఇప్పుడిప్పుడే కిట్టూ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారన్నమాట.పేర్ని నానిని యువజన విభాగం అధ్యక్షుడిగా విభజించారు కానీ..
Perni Nani : తాను రాజకీయాల నుంచి తప్పుకుంటేనే కొడుక్కి భవిష్యత్తు ఉంటుందా?
దాని వల్ల వచ్చే ఉపయోగం పెద్దగా లేదు. వచ్చే ఎన్నికల్లో తన కొడుక్కి టికెట్ ఇవ్వమని పేర్ని నాని.. సీఎం జగన్ ను అడిగే చాన్స్ ఉన్నా.. టికెట్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అందుకే.. తాను రాజకీయాల నుంచి రిటైర్ అయి ఎమ్మెల్యే టికెట్ ను తన కొడుకుకి ఇస్తే.. తన కొడుకును ఎలాగైనా గెలిపించుకుంటా అని పేర్ని.. సీఎం జగన్ ను రిక్వెస్ట్ చేయనున్నారట. నిజానికి.. ఇది ఒక్క పేర్ని నానికే సంబంధించింది కాదు.. దాదాపు చాలామంది సీనియర్ వైసీపీ నాయకులు తమ వారసుల ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. చాలామంది నేతలు తమ వారసులకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు కావాలని అధిష్ఠానాన్ని అడిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
అందులో పేర్ని నాని ఒకరు అయ్యారు. ఆయన కొడుకును యాక్టివ్ చేసి వచ్చే ఎన్నికల్లో కొడుక్కి టికెట్ వచ్చేలా చేసి ఇక తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారట.అందుకే ఇప్పటి నుంచే తన కొడుకును పేర్ని నాని రాజకీయాల్లో యాక్టివ్ చేస్తున్నారు. నియోజకవర్గం బాధ్యతలను కూడా కిట్టుకే అప్పగించారు. ప్రస్తుతం మచిలీపట్నం బాధ్యతలను కిట్టూనే చూసుకుంటున్నారు. తన కొడుకును జగన్ కు కూడా పరిచయం చేశారు. నియోజకవర్గం ప్రజలకు తన కొడుకును పరిచయం చేస్తూ వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం టికెట్ ను తన కొడుకుకు వచ్చేలా చేసి ఇక తాను హాయిగా ఇంట్లో తడి గుడ్డ వేసుకొని కూర్చోవాలని పేర్ని నాని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.