YCP : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల పాపం వైసీపీ ఎమ్మెల్యే లదే ?
YCP : 2019లో వైసీపీ గెలిచాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా మొన్నటి వరకు వైసీపీ వార్ వన్ సైడ్ అన్న తరహాలో ఫలితాలు సాధించింది. దీంతో ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులకు ఇన్చార్జిలకు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు 175 కి 175 టార్గెట్ ఇవ్వటం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే శాసనమండలి పట్టాభద్రుల ఎన్నికలలో వైసీపీకీ మతిపోయేలా టీడీపీ పార్టీ ఫలితాలు సాధించింది. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ముందు… జరిగిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పుంజుకోవడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. కచ్చితంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు 2024 సాధారణ ఎన్నికలకు సంకేతంగా నిలుస్తున్నాయని ఇవే ఫలితాలు
రానున్న ఎన్నికల్లో రిపీట్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఏ ఎన్నికలలో అయినా నిన్న మొన్నటి వరకు మెజారిటీ ఫలితాలు సాధించిన వైసీపీ ఒక్కసారిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాఫ్ పడిపోవడానికి ప్రధాన కారణం ఆ పార్టీ యొక్క ఎమ్మెల్యేలే అని ప్రచారం జరుగుతుంది. జరిగిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మినహా ఈ ఎన్నికలను ఎవరూ కూడా పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. ఓటర్ల నమోదు నుంచి పోలింగ్ దాకా ఈ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. జరిగిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని వైసీపీ ఎమ్మెల్యేలు కనీసం కరపత్రం లేదా ప్రకటన కూడా చేయలేదట. ఈ క్రమంలో వైసీపీకి ఓటు వేయాలన్న ఆ పార్టీ అభ్యర్థి ఎవరో కూడా తెలియని పరిస్థితి ఓటర్ లలో నెలకొంది అంట.
పైగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను పూర్తిగా వాలంటీర్లు చూసుకున్నారు అన్న భావనతో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారట. ఫలితంగా టీడీపీ పుంజుకోవడంతో. వైసీపీ గెలుపు కోసం విరోచితంగా పోరాడిన కేడర్… లో తాజా ఎమ్మెల్సీ ఎన్నికల లో ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు తీవ్ర ఆగ్రహానికి గురిచేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇదే తీరు కొనసాగితే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ పార్టీకి క్యాడర్ చేజారిపోయే అవకాశం ఉందని.. విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో అధినేత వైయస్ జగన్ రంగంలోకి దిగి ఎమ్మెల్సీ ఫలితాలపై లోతైన సమీక్ష చేపట్టాలని కోరుతున్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీకి అనుకూలమైన ఓటర్లు.. ఎంతమంది ఉన్నారు. ఏవైనా అవకతవకలు జరిగాయా అలాంటి విషయాలు.. తెలుసుకుంటే.. కేడర్ చేజారి పోకుండా ఉంటుందని విశ్లేషిస్తున్నారు.