స్థానిక సంస్థల ఎన్నికలు డిసైడ్ చేసేది మీరేనా సాయి రెడ్డి గారూ??
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల గురించి జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో కానీ.. దాని గురించి జరుగుతున్న చర్చ మాత్రం అస్సలు ఆగడం లేదు. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బాధ్యత మొత్తం ఎన్నికల కమిషన్, ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. కానీ.. వైసీపీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో జోక్యం చేసుకునే వీలే ఉండదు.

ycp mp vijayasai reddy on ap local body elections
అయితే.. తమకే అన్ని తెలుసు అన్నట్టుగా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారు. ఈసీ ఎన్నికల గురించి చెప్పకముందు వాళ్లే చెప్పేస్తున్నారు. ఎన్నికల డేట్ ను కూడా ఫిక్స్ చేసేస్తున్నారు.
ఓవైపు ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వచ్చే నెల అంటే ఫిబ్రవరిలో పరీక్షలు ఉంటాయని చెబితే… వైసీపీ నేతలు మాత్రం ఏప్రిల్, మేలో పరీక్షలు నిర్వహిస్తామంటూ చెబుతున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఏప్రిల్, మే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని పార్టీ అనుకుంటోంది.. అంటూ పెద్ద బాంబు పేల్చారు.
అంటే ఆయన ఏప్రిల్, మే నెలలో జరుగుతాయి.. అని చెప్పడానికి పెద్ద రీజన్ కూడా ఉంది. అదేంటంటే.. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వచ్చే మార్చిలో రిటైర్ కాబోతున్నారు. ఆయన రిటైర్ అయిన తర్వాత… వేరే వాళ్లు ఈసీగా నియమితులవుతారు. అప్పుడు తాము అనుకున్నట్టుగా ఎన్నికలను నిర్వహించుకోవచ్చనేది వైసీపీ ప్లాన్.
ఎలాగూ అప్పటి వరకు కరోనా పరిస్థితులు కూడా చక్కదిద్దుకుంటాయి. తిరుపతి ఉపఎన్నిక కూడా అప్పటిలోపు పూర్తయిపోతుంది.. అన్న ఉద్దేశంతో.. వైసీపీ నేతలే ఈసీ కన్నా ముందు ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలో ఫిక్సయిపోతున్నారు.