YSRCP : వైఎస్సార్సీపీకి మేలు చేస్తున్న యెల్లో మీడియా.!
YSRCP : వైసీపీ ప్రభుత్వంపై పూర్తిస్థాయి భరోసా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి వుంది. 2019 ఎన్నికల్లో 151 సీట్లు దక్కడంతో ఘనంగా అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ, అధికారంలోకి వస్తూనే ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేయడంపై ఫోకస్ పెట్టింది. ప్రధానంగా సంక్షేమ క్యాలెండర్ రూపొందించుకుని, క్రమం తప్పకుండా ఆ సంక్షేమ పథకాల్ని ప్రజలకు చేరవేస్తోంది… అదీ అస్సలేమాత్రం అవినీతికి తావు లేకుండా. అయితే, ప్రతి సంక్షేమ పథకంపైనా విపక్షాలు బురద చల్లడం, సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు కావడంలేదంటూ యెల్లో మీడియా దుష్ప్రచారం.. వీటన్నిటిపైనా అధికార వైసీపీ విసిగిపోయింది.
చూస్తుండగానే మూడేళ్ళు గడిచిపోయాయ్. ఎన్నికల వేడి అప్పుడే ప్రారంభమైంది. రెండేళ్ళ ముందే హీట్ పెరిగిన దరిమిలా, అధికార వైసీపీ అప్రమత్తమైంది.గడప గడపకూ మన ప్రభుత్వమంటూ వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిథులు ప్రజల వద్దకు వెళుతున్నారు. ఈ క్రమంలో కొన్ని చోట్ల ప్రజల నుంచి వ్యతిరేకత కూడా ఎదురవుతోంది వారికి. అయితే, దీన్నంతటినీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందే ఊహించారు. ప్రభుత్వం పట్ల సానుకూలత వున్నా, ప్రజా ప్రతినిథుల్లో కొందరు ప్రజలకు దూరంగా వుంటున్నారంటూ అందిన ఫీడ్ బ్యాక్ నేపథ్యంలో..

Yellow Media doing good to YSRCP
ఈ గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ అవకాశంగా తీసుకున్నారు.తాను జిల్లాల పర్యటనలు చేస్తూ, విపక్షాల తీరుని ఎండగడుతున్న వైఎస్ జగన్, పార్టీ శ్రేణులకూ అదే తరహాలో దిశా నిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ అనుకూల మీడియాలో వచ్చే వార్తల్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోంది. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వీటిని ఫాలో అవుతూ, తమకు వ్యతిరేకత ఎదురవుతున్న చోట్ల డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు ఉపక్రమిస్తున్నారట. అప్పుడప్పుడూ రాజకీయ ప్రత్యర్థులు, శత్రువులు కూడా మేలు చేస్తుంటారనడానికి ఇదే నిదర్శనం.