Marriage After 30 Years : 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటే వచ్చే ప్రధాన సమస్యలివే..!
Marriage After 30 Years : ప్రతీ ఒక్కరి జీవితంలో జరిగే అపురూపమైన ఘట్టం ‘పెళ్లి’. కాగా, ఈ మ్యారేజ్ అనేది వారి పర్సనల్ చాయిస్ కూడా. వారికి ఇష్టం ఉన్న టైంలోనే వారు మ్యారేజ్ చేసుకుంటారు. అయితే, ఏజ్ మరీ ఎక్కువవుతున్న కొద్ది పెళ్లి అవుతుందో కాదో నని అమ్మాయి తరఫు వారు కాని అబ్బాయి తరఫు వారు కాని భయపడుతుంటారు. ముఖ్యంగా తల్లిదండ్రులు త్వరగా పెళ్లి చేసేయాలని అనుకుంటుంటారు. అయితే, పెళ్లి ఎప్పుడు చేసుకోవాలంటే..పూర్వంలో మాదిరిగా మరీ పిల్లలుగా ఉన్నపుడే అయితే ఇప్పుడు పెళ్లిళ్లు జరగడం లేదు.
కానీ, ఇప్పుడు అమ్మాయి కాని అబ్బాయి కాని సెటిల్ కావడం కోసం ఎక్కువ టైం తీసుకుంటున్నారు. కెరీర్ పైన ఫోకస్, జాబ్ పైన ఫోకస్, హయ్యర్ స్టడీస్ ఇలా రకరకాల కారణాలతో మ్యారేజ్ కొంత కాలం పోస్ట్ పోన్ చేస్తున్నారు. అయితే, అలా ఎక్కువ కాలం వాయిదా వేయడం కూడా మంచిది కాదు.మరీ ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకున్నట్లయితే కొన్ని ఇబ్బందులు వచ్చే చాన్సెస్ ఉంటాయని నిపుణులు వివరిస్తున్నారు. పెద్దలు చెప్పినట్లు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి.
Marriage After 30 Years : నిపుణులు చెప్పిన ఈ విషయాలు పాటిస్తే మేలు…
కెరీర్ పై ఫోకస్ పెట్టి వైవాహిక జీవితం గురించి ఆలోచించకపోతే పెద్ద ఇబ్బందేనని అంటున్నారు. ఇకపోతే 30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నట్లయితే వైవాహిక జీవితం చాలా డల్ గా సాగిపోతుందని నిపుణులు అంటున్నారు. భార్యా భర్తల మధ్య రిలేషన్ షిప్ స్ట్రాంగ్ కావాలంటే 30 ఏళ్ల లోపే పెళ్లి చేసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తు గురించి ప్లాన్ చేసుకునే సమయంలో పెళ్లి, వైవాహిక జీవితం గురించి కూడా ఆలోచించాలని చెప్తున్నారు. ఇకపోతే ఒత్తిడి కూడా పెరిగిపోకుండా ఉండాలంటే పెళ్లి విషయంపైన కూడా ఫోకస్ చేయాలి.