Roja : రోజా జబర్దస్త్ మాటలు… ఆమె మాటలకు చిర్రెత్తుకొచ్చిన జగన్ ఏం చేశారంటే..?
Roja : వైఎస్సార్సీపీ పార్టీలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాది ప్రత్యేక స్థానం. నిజానికి ఆమె వైఎస్సార్సీపీ పార్టీకే ఫైర్ బ్రాండ్ అని చెప్పుకోవాలి. తన వల్ల పార్టీకి ప్లస్సే. తను సినీరంగం నుంచి వచ్చారు. తనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అభిమానులు ఉన్నారు. అలాగే.. దశాబ్దాల రాజకీయ అనుభవం కూడా ఉంది. రెండోసారి నగరి నియోజకవర్గం నుంచి గెలిచి తన సత్తాను చాటారు రోజా. మొదటి సారి అంటే పార్టీ అధికారంలో లేదు కాబట్టి.. మంత్రి పదవి వచ్చే అవకాశం రాలేదు. రెండో సారి పార్టీ అధికారంలోకి రావడంతో తనకు మంత్రి పదవి గ్యారెంటీ అని అనుకున్నారు రోజా. కానీ.. కొన్ని సమీకరణల నేపథ్యంలో రోజాకు మంత్రి పదవి దక్కలేదు.
సరే.. సీఎం జగన్ రెండోసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పేసరికి.. తనకు ఈసారి మంత్రివర్గ విస్తరణలో అయినా మంత్రి పదవి దక్కుతుందని రోజా తెగ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మంత్రి పదవికి సంబంధించి పైరవీలు కూడా చేయడం మొదలు పెట్టారట రోజా. అంతా బాగానే ఉంది. రోజా రాజకీయ ట్రాక్ రికార్డు కూడా ఓకే. జగన్ తలుచుకుంటే రోజాకు మంత్రి పదవి ఇవ్వొచ్చు. కానీ.. రోజాను మంత్రి కాకుండా అడ్డుకునేది ఒక్కటే. అదే జబర్దస్త్. అవును.. తను 2014 లో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే.. పార్టీ హైకమాండ్.. జబర్దస్త్ ప్రోగ్రామ్ ను వదిలేయాలని చెప్పిందట. ఎందుకంటే.. జబర్దస్త్ ప్రోగ్రామ్ వచ్చేది వైసీపీ కూడా పూర్తిగా ప్రత్యర్థి అయినా మీడియా మొఘల్ చానెల్ లో. అందుకే తనను ఆ ప్రోగ్రామ్ నుంచి తప్పుకోవాలని అప్పుడే సూచించారట. కానీ.. రోజా మాత్రం అది తన పర్సనల్ అని.. సినిమా రంగాన్ని, రాజకీయ రంగంతో పోల్చొద్దు అంటూ ఏవేవో చెప్పిందట. అప్పుడంటే పార్టీ అధికారంలో లేదు కాబట్టి.. వైసీపీ హైకమాండ్ కూడా లైట్ తీసుకుంది. కానీ.. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది కదా.
Roja : ఇప్పటికీ జబర్దస్త్ ను వదలని రోజా.. అదే రోజా మంత్రి పదవికి అడ్డంకి?
అయితే.. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినా.. రోజా మాత్రం జబర్దస్త్ ను వదలను అని అంటోంది. అంతే కాదు.. ఒకవేళ తనకు మంత్రి పదవి ఇస్తే.. అప్పుడు జబర్దస్త్ ను వదిలేస్తాను.. అని ఆమె సీనియర్ నేతలతో చెప్పారట. ఆ విషయం.. సీఎం జగన్ కు చేరిందట. దీంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చినట్టు తెలుస్తోంది. దీంతో తనను ఈసారి మంత్రి వర్గ విస్తరణలో కూడా జగన్ పక్కన పెడుతున్నారు.. అనే టాక్ వినిపిస్తోంది. అలాగే.. ఆమె ఉండేది హైదరాబాద్ లో. నిజానికి తను నగరి ఎమ్మెల్యే. ఎప్పుడో ఒకసారి నగరి వెళ్లి రావడం తప్పితే అక్కడ ఉండి.. నగరి ప్రజల సమస్యలను తను ఏనాడూ పట్టించుకోలేదు.. అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. అందుకే.. ఇటువంటి నేపథ్యంలో రోజాకు మంత్రి పదవి ఇస్తే లేనిపోని సమస్యలు వస్తాయని.. జగన్ కూడా తనను ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. చూద్దాం మరి.. రోజా ప్రయత్నాలు సఫలం అవుతాయా? తను మంత్రి అవుతుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.