Ys Jagan : జగన్‌ ఆ సామాజిక వర్గంపై ఆశలు వదులుకోవాల్సిందేనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ys Jagan : జగన్‌ ఆ సామాజిక వర్గంపై ఆశలు వదులుకోవాల్సిందేనా?

Ys Jagan : ఏపీలో రెడ్డి మరియు కమ్మ సామాజిక వర్గంకు చెందిన వారు రాజ్యం ఏలుతారు అనడంలో సందేహం లేదు. కమ్మ నాయకులు మొదటి నుండి కీలక పదవులు నిర్వహిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గం మద్దతు లేకుండా అధికారంలోకి రావడం దాదాపు అసాధ్యం అని అంతా అనుకున్నారు. కాని అనూహ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి కొత్త చరిత్రను సృష్టించాడు. చంద్రబాబు నాయుడు పై కమ్మ సామాజిక వర్గంలో కూడా […]

 Authored By himanshi | The Telugu News | Updated on :27 May 2021,6:30 pm

Ys Jagan : ఏపీలో రెడ్డి మరియు కమ్మ సామాజిక వర్గంకు చెందిన వారు రాజ్యం ఏలుతారు అనడంలో సందేహం లేదు. కమ్మ నాయకులు మొదటి నుండి కీలక పదవులు నిర్వహిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గం మద్దతు లేకుండా అధికారంలోకి రావడం దాదాపు అసాధ్యం అని అంతా అనుకున్నారు. కాని అనూహ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి కొత్త చరిత్రను సృష్టించాడు. చంద్రబాబు నాయుడు పై కమ్మ సామాజిక వర్గంలో కూడా ఉన్న వ్యతిరేకత కారణంగా వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చి ఉంటాడు అనేది కొందరి వాదన. అయితే రాబోయే రోజుల్లో మాత్రం కమ్మ సామాజిక వర్గం మద్దతు లేకుండా జగన్ మనుగడ సాధ్యం కాదేమో అంటున్నారు.

Ys Jagan This community Lots of hopes

Ys Jagan This community Lots of hopes

Ys Jagan : ముద్రగడకు గాలం..

ఏపీలో కమ్మ సామాజిక వర్గం అనగానే అందరికి గుర్తుకు వచ్చే పేరు ముద్రగడ పద్మనాభం. ఈయన్ను వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కాస్త సైలెంట్‌ గానే ఉంచారు. అంటే ఈయన వైకాపా కు మద్దతు అనే సంకేతాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఆయన కు వైకాపా నుండి ఆహ్వానం అందింది అంటూ వార్తలు వస్తున్నాయి. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు కాదు కాని వైకాపా నాయకులతో ఆయన క్లోజ్ గా ఉండటం మొదలుకుని పలు విషయాల్లో ఆయన వైకాపాకు మద్దతుగా ఉన్నాడు. అందుకే ఆయనకు ఎంపీ సీటును ఇవ్వాలని కూడా సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి భావిస్తున్నాడనే వార్తలు వచ్చాయి. ఆయనకు పదవి ఇచ్చినంత మాత్రాన కమ్మ వారు అంతా కూడా వైకాపా వెంట వస్తారా అంటే అనుమానమే.

Ys Jagan : టీడీపీ అంటే కమ్మ పార్టీ..

తెలుగు దేశం పార్టీ అంటేనే కమ్మ పార్టీ. కమ్మ పార్టీ నాయకులు తెలుగు దేశంలో చాలా మంది ఉన్నారు. వారు ఈసారి సామాజిక వర్గం పేరుతో కాస్త సీరియస్ గానే అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురు కమ్మ నాయకులను వైకాపా ప్రభుత్వం ఇబ్బంది పెట్టేలా ప్రయత్నిస్తుంది. కమ్మ సామాజిక వర్గంలోని పలువురు ఇప్పుడు ఆర్థికంగా కుదేలయ్యారు. దాంతో మళ్లీ వైకాపాకు మద్దతుగా నిలిచే అవకాశం లేదంటూ కొందరు కమ్మ నాయకులు అంటున్నారు. ఎన్నికలకు ఇంకా మూడు సంవత్సరాలు సమయం ఉంది. కనుక అప్పటి వరకు జగన్ ఏదైనా అద్బుతం చేసి కమ్మ వారిని తమ వైపుకు తిప్పుకుంటాడా లేదంటే వారి వల్ల అధికారంను కోల్పోతాడా అనేది కాలమే నిర్ణయించాలి.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది