YS Jagan : వైఎస్ జగన్.. షర్మిల ఆస్తి తగాదాలేనా.. ఇంకా ఏమైనా ఉన్నాయా?
YS Jagan : తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీని ప్రారంభించిన సమయంలో కచ్చితంగా ఆమె వెనుక జగన్ ఉండి ఉంటాడు అని అంతా అనుకున్నారు. ఏపీలో అన్న తెలంగాణలో చెల్లి అధికారం చెలాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే వాదనలు కూడా వినిపించాయి. వైయస్ షర్మిల పార్టీకి మొత్తం ఫైనాన్సియల్ సపోర్టు జగన్ నుంచి వస్తుందని… పక్క రాష్ట్రం నిధులు భారీ ఎత్తున తెలంగాణలో షర్మిల పార్టీ కోసం పారుతాయనే ప్రచారం జరిగింది.షర్మిల పార్టీ వెనుక ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ లు ఉన్నట్లుగా మొదట జోరుగా వార్తలు వచ్చాయి… కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై షర్మిల చాలా కోపంగా ఉందని.. ఆమె పార్టీ తో జగన్ కు ఏ సంబంధం లేదు అనిపిస్తుంది.
షర్మిల మరియు జగన్ ల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నట్లుగా గత కొన్ని రోజులుగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వాదిస్తూ వస్తున్నాడు. ఆ వాదనలు నిజమే అన్నట్లుగా ఇటీవల షర్మిల చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. ఏపీలో కూడా తన పార్టీ ఉంటుందని ఆమె ప్రకటించడం ద్వారా ఇప్పుడు కాకున్నా ముందు ముందు అయినా అన్న జగన్ మోహన్ రెడ్డి కి పోటీగా నిలుస్తుందనే వాదన వినిపిస్తోంది. తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా తన పార్టీ కార్యక్రమాలు జరుగుతాయని ప్రకటించడం ద్వారా జగన్ ను గట్టిగానే ఢీకొనడం కోసం ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.ఏపీలో షర్మిల ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా జగన్ కు కష్టాలు తప్పవు అని ఒక వర్గం వారు భావిస్తున్నారు. అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న ఆస్తి తగాదాలు షర్మిలను ఇంత దూరం తీసుకోవచ్చా లేదంటే రాజకీయంగా మరేదైనా ఉద్దేశం ఉందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
YS jagan : అన్నాచెల్లి మద్య వివాదం మరింత ముదిరేనా..!
వేల కోట్ల ఆస్తుల పంపకం విషయంలో అన్నా చెల్లి గొడవలు పడ్డారు అంటే నమ్మశక్యంగా లేదు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. అన్నాచెల్లెళ్ల మధ్య గొడవలకు ఆస్తి తగాదాలే కాకుండా మరేదైనా బలమైన కారణం కూడా ఉండి ఉంటుందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మొత్తానికి వైయస్సార్ కుటుంబం ఇలా విడిపోవడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముందు ముందు అయినా అన్నా చెల్లెలు కలుసుకోవాలని అంతా కోరుకుంటున్నారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు వైకాపాను పాదయాత్ర చేసి మరీ బతికించిన ఘనత షర్మిలది. అందుకే ఆమెకు సరైన గౌరవం ఇవ్వాలని ప్రతి ఒక్కరు పార్టీలో భావించారు. కానీ జగన్ మాత్రం ఆమెను పక్కకు ఉంచడం వల్లే ఈ వివాదం మొదలైంది అనేది ఒక వర్గం వారి వాదన. అసలు విషయం ఏంటి అనేది వారు క్లారిటీ ఇస్తే గాని తెలియదు.