YS Jagan : వైఎస్ జగనన్న బడ్జెట్.. మరో సారి పేదల ఆరోగ్యం కోసం భారీ నిధులు
YS Jagan : ఒకప్పుడు పేదలకు కార్పొరేట్ వైద్యం అంటే అందని ద్రాక్షగా ఉండేది. లక్షలకు లక్షలు ఫీజులు చెల్లించి పెద్ద ఆసుపత్రి లో చికిత్స చేయించుకునే స్తోమత లేక పేదలు ఎంతో మంది అనారోగ్యం బారిన పడి మృతి చెందిన విషయం తెలిసిందే. పేదల ఆరోగ్యం పట్ల చలించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంచి మనసుతో ఆరోగ్య శ్రీ అనే అద్భుతమైన పథకం తీసుకు వచ్చారు. ఆరోగ్య శ్రీ తో పేదలను కార్పోరేట్ ఆసుపత్రుల వైపుకు నడిపించగలిగారు. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా ఈ పథకం ప్రాచుర్యం పొందింది అనడంలో సందేహం లేదు. ఆయన చనిపోయిన తర్వాత కూడా పథకంను కొనసాగించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ అదే పేరు తో పథకంను కొనసాగిస్తున్నారు.చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకం పేరు మార్చి కొత్త పేరుతో తీసుకు వచ్చారు.
ఏపీకి సీఎంగా జగన్ మోహన్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత మళ్లీ ఆరోగ్యశ్రీని ప్రజల ముందుకు తీసుకు వచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్య శ్రీని మరింత అద్భుతంగా జనాల్లోకి తీసుకు వెళ్లాలి అనుకున్నారు.. అందుకు ప్రయత్నాలు చేశారు. ఆరోగ్య శ్రీలో మరిన్ని వైద్య సేవలను చేర్చడంతో పాటు ఇతర అవసరాల కోసం కూడా నిధులు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమయంలో ఆరోగ్య శ్రీ కొన్ని కోట్ల మంది ప్రజల ఆరోగ్యం కు భరోసాగా నిలిచింది.తాజా బడ్జెట్లో మరోసారి ఆరోగ్య శ్రీ తో పేదల ఆరోగ్యానికి భరోసా కలిగిస్తూ ఏకంగా బడ్జెట్లో 12 శాతం నిధులను ఆరోగ్య శ్రీకి కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించడం ప్రతి ఒక్క పేద వారికి ఆనందం కలిగించే విషయం. ఈ ఏడాది బడ్జెట్లో 15 వేల కోట్లకు పైగా ఆరోగ్య శ్రీ నిధులు కేటాయించడం జరిగింది. ప్రతి ఒక్క పేద వారికి ఉచిత ఆరోగ్య సేవలు అందించే ఉద్దేశం.
సీఎం జగన్మోహన్ రెడ్డి భారీ ఎత్తున నిధులను కేటాయించారని తెలుస్తోంది. ఏ రాష్ట్రంలో కూడా లేని అద్భుతమైన వైద్య సేవలను ఏపీలో అందిస్తున్నారని ఆ పార్టీకి చెందిన నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పేదల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చిరస్మరణీయంగా నిలిచిపోతారని ఈ సందర్భంగా వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైయస్ రాజశేఖర్రెడ్డి ఎలా అయితే ఆరోగ్యశ్రీని మొదలు పెట్టి అద్భుతమైన విజయాన్ని సాధించడంతో ఇప్పటికి పేద ప్రజలు ఆయనను తలుసుకుంటున్నారో.. భవిష్యత్తులో కూడా అలాగే జగన్ ని కూడా తల్చుకుంటారు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.