YS Jagan : ఈ దెబ్బతో బీజేపీని నమ్ముకోవడం దండగా అని జగనన్నకు తెలిసి వచ్చి ఉంటుందా?
YS Jagan : బీజేపీని నమ్ముకుంటే వాడుకుని వదిలేస్తారని ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలిసి వచ్చింది. గతంలోనే జనసేనాని పవన్ కళ్యాణ్ కు తెలిసినా కూడా తన ముందు మరో ఆప్షన్ కనిపించడం లేదు కనుక ఆయన వారి వెంట నడవాలని భావిస్తున్నాడు. ఆ సమయంలోనే మోడీని సీఎం వైఎస్ జగన్ కూడా నమ్ముకున్నాడు. రాష్ట్రంకు ఏదో చేస్తాడని తనకు కూడా వ్యక్తిగతంగా ఏమైనా సాయం చేస్తాడనే ఉద్దేశ్యంతో పార్లమెంట్ లో పలు సార్లు ప్రత్యక్షంగా లేదంటే పరోక్షంగా మద్దతు తెలిపిన సందర్బాలు ఉన్నాయి. కాని మోడీ మాత్రం తనకు ఏం చేయడం లేదని, రాష్ట్రంకు రావాల్సిన మినిమం ఫండ్ ను కూడా మంజూరు చేయడం లేదు అంటూ జగన్ ఒక క్లారిటీకి వచ్చాడు.
YS Jagan : మోడీతో స్నేహం లాభం కంటే నష్టం ఎక్కువ..
ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఆయన స్నేహితులకు కష్టాలను తెచ్చి పెడుతున్నాయి. తాజాగా విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన ప్రవేటీకరణ నిర్ణయం అధికార వైకాపాతో పాటు బీజేపీకి మిత్ర పక్షంగా ఉన్న జనసేనకు కూడా దెబ్బ పడేలా చేసింది. విశాఖ ఉక్కు విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గట్టిగా తప్పుబట్టలేక, అలా అని సమర్థించలేక జగన్ తీవ్రంగా మదన పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సున్నితంగా బీజేపీ నిర్ణయాన్ని తప్పుబడుతూ మోడీజీ మా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకండి ఇంకేదైనా చేద్దాం అన్నట్లుగా సున్నితంగా లేఖ రాశాడు. మోడీతో స్నేహంగా ఉండే మీరు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపలేక పోతున్నారు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇలా మోడీతో స్నేహం వల్ల లాభాల కంటే నష్టం ఎక్కువగా ఉంది.
ప్రధాని మోడీకి దూరంగా జగన్..
బీజేపీకి దగ్గరగా ఉంటూ వస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో పార్టీకి నష్టం జరగడం ఖాయం అంటూ ఇప్పటికే సీఎం వైఎస్ జగన్‌కు తెలిసి వచ్చింది. గతంలో తెలుగు దేశం పార్టీ మరియు జనసేన పార్టీల విషయంలో జరిగిందే వైకాపాకు జరుగకుండా ఉండాలంటే కాస్త ముందు చూపుతో ఆలోచించాలనే ఉద్దేశ్యంతో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటూ ఇకపై బీజేపీకి దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తాజాగా సన్నిహితులతో వైఎస్ జగన్ అంటున్నట్లుగా తెలిసింది. ప్రధాని నరేంద్ర మోడీ వాడేసుకుని కనీసం సాయం చేయక పోగ జనాల్లో ఇబ్బంది పడేలా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. తద్వార రాష్ట్రంలో తాము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని జగన్ భావిస్తున్నాడట. అందుకే మోడీకి సాధ్యం అయినంత దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.