YS Jagan : అరేయ్ పవన్ కళ్యాణ్ మూతిమీద మీసం ఉంటె రారా.. సింహంలా ఒక్కోడినే వస్తా.. వైఎస్ జగన్
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వాడి వేడిగా ఉన్నాయి. ఎన్నికలకు ఏడాది ఉన్నాగాని.. ఇప్పటి నుండే ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. సీఎం జగన్ ఒకవైపు మిగతా పార్టీలు మరోవైపు అన్న తరహాలో పరిస్థితి మారింది. ఈ క్రమంలో తెనాలిలో మూడో విడత రైతు భరోసా నిధులను విడుదల చేసే కార్యక్రమంలో సీఎం జగన్ మహాసభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుది పెత్తందారుల పార్టీ. మనది పేదల ప్రభుత్వం. రైతులను.. వంచించిన చంద్రబాబు ఒకవైపు… రైతులకు అండగా ఉంటున్న వైసీపీ మరొకవైపు ఉంది. కరువుతో స్నేహం ఉన్న చంద్రబాబు ఒకవైపు… వరుణ దేవుడి ఆశీస్సులు ఉన్న..
మన ప్రభుత్వం మరోవైపు ఉంది అని ప్రసంగించారు. కరువుకు తీరాఫ్ అడ్రస్ చంద్రబాబు అనీ అన్నారు. రాష్ట్రంలో రాజకీయ యుద్ధం జరుగుతుంది అని జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కుట్రలను అన్యాయాలను గమనించి ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్న దాన్ని ప్రామాణికంగా తీసుకుని నిర్ణయం తీసుకోవాలని జగన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో గత దొంగల ముఠా ఉందని… ఆ ముఠా పని… దోచుకో పంచుకో మాత్రమే. గత దొంగల ముఠాలో ఇంకొకరు దత్తపుత్రుడు. ఈ దుష్ట చతుష్టయానికి తోడు దత్తపుత్రుడు జత కలిశాడని పేర్కొన్నారు.
చంద్రబాబు హయాంలో ఇప్పుడు అమలు అవుతున్న సంక్షేమ పథకాలను ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఆ సమయంలో డబ్బులు ఎవరి జోబుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు. ఇదే సమయంలో రాష్ట్రంలో 175కి 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం చంద్రబాబుకి ఆయన దత్త పుత్రుడికి ఉందా అని జగన్ సంచలన సవాల్ విసిరారు. మీ బిడ్డకు భయం లేదు ఎందుకంటే భగవంతుడి దయ… మిమ్మల్ని నమ్ముకున్నాను. వాళ్ళ యొక్క మాదిరిగా నా దగ్గర ఈనాడు.. ఆంధ్రజ్యోతి.. టీవీ5, దత్తపుత్రుడు లేడూ. అయినా సరే ..చేసిన మంచి చెప్పుకునే మళ్లీ అధికారంలోకి వస్తామని జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.