KTR : దటీజ్ కేటీఆర్.. ఏపీలో సీఎం జగన్ ను అడ్డంగా బుక్ చేశారు?
KTR : అవును.. ఏపీలో కేటీఆర్ హవా నడుస్తోంది ఇప్పుడు. తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ఏపీలో ఏం పని. అయినా సీఎం జగన్ ఎలా బుక్ చేశారు.. అంటారా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో కేటీఆర్.. ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ఇరుకున పెట్టేశారు. ఏపీ ప్రజల ముందు జగన్ ను అడ్డంగా బుక్ చేశారు.
ఒక తెలంగాణ మంత్రి ఫ్లెక్సీలకు ఏపీలో.. అది కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ముందు పాలాభిషేకాలు జరుగుతున్నాయి అంటే అది ఏపీ ముఖ్యమంత్రికి నాదాన్ కాదా? ఏపీ నడిబొడ్డున జై కేటీఆర్ అంటూ నినాదాలు వినిపించడమే కాదు.. సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో ఈ టాపిక్ హాట్ గా మారింది.
KTR : విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు మద్దతిస్తా
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తానని.. దాన్ని కాపాడుకునేందుకు కార్మికులు, అఖిల పక్షం చేస్తున్న పోరాటానికి, ఆందోళనకు ఖచ్చితంగా తాను మద్దతు ఇస్తానని.. కేటీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే కదా.
తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రకటించిన మద్దతును విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు స్వాగతించాయి. వెంటనే కేటీఆర్ ఫ్లెక్సీలను కట్టి.. ఆయనకు పాలాభిషేకం చేశారు.
పక్క రాష్ట్రాల నాయకులు మాత్రం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమానికి మద్దతు పలుకుతుంటే.. సొంత రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఏం చేస్తోంది. ప్రభుత్వం ఏం చేస్తోంది. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు.. అంటూ సీఎం జగన్ పై కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు విరుచుకుపడుతున్నాయి.
దీంతో తన సొంత రాష్ట్రంలో సీఎం జగన్ ను మంత్రి కేటీఆర్ అడ్డంగా బుక్ చేసేశారు. దీంతో ఏం చేయలని పరిస్థితి సీఎం జగన్ ది. చూద్దాం మరి.. జగన్.. ఈ విషయంలో కేటీఆర్ ను ఎదుర్కునేందుకు ఎటువంటి ప్లాన్ వేస్తారో?