వైఎస్‌ జ‌గ‌న్‌కు కొత్త త‌ల‌నొప్పి.. మ‌ళ్లీ అంద‌రూ రెడ్లే..!

0
Advertisement

Ys jagan : ఏపీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణ చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ముగ్గురు లేదా నలుగురు మంత్రులను తొలగించి కొత్తగా అయిదు లేదా ఆరుగురిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. వైకాపా అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఉన్న మంత్రి పోస్టులు కొన్ని అయితే ఆశావాహులు మాత్రం చాలా మంది ఉన్నారు. మంత్రి పదవి కోసం ఆశ పడుతున్న వారిలో ఎక్కువ శాతం మంది రెడ్డి సామాజిక వర్గంకు చెందిన వారే కావడం ఇప్పుడు పెద్ద చిక్కుగా మారింది.

Ys jagan : రెడ్డి కి మంత్రి కష్టం..

సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి తో పాటు పలువురు మంత్రులు రెడ్డి సామాజిక వర్గం నుండి మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే రెడ్డి రాజ్యం అంటూ విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మరింత మంది రెడ్లను మంత్రి వర్గంలోకి తీసుకోవడం వల్ల విమర్శలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అదే ఆలోచనలో ఉన్నాడు. కాని ఆయనకు వివిధ జిల్లాల నుండి మంత్రి పదవి కోసం వస్తున్న దరకాస్తులు ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గం నుండే అంటూ సమాచారం అందుతోంది.

Ys jagan facing trouble with reddys
Ys jagan facing trouble with reddys

Ys jagan : సందిగ్దంలో సీఎం జగన్‌..

రెడ్డి సామాజిక వర్గంకు చెందిన వారిని ఎక్కువ సంఖ్యలో మంత్రి వర్గంలోకి తీసుకుంటే విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఆ కారణంగానే మంత్రి వర్గ విస్తరణ విషయంలో వైకాపా అధినాయకత్వం ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుండి రెడ్డి సామాజిక వర్గ నాయకులతో చర్చలు జరిపి వారిని ఒప్పంచి వారికి మరేదైనా పదవులు ఆఫర్‌ చేసి ఆ తర్వాత మంత్రి వర్గ విస్తరణ చేస్తే బాగుంటుంది. లేదంటే సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డికి విమర్శలు తప్పవు అంటూ రాజకీయ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి===> నెటిజ‌న్ల టాక్ : బాబును తర్వాత విమర్శించవచ్చు.. మొదట మమ్ముల కాపాడండి మంత్రి గారు..!

ఇది కూడా చ‌ద‌వండి===> తమిళనాడు లో చంద్రబాబు పరువు పోయింది – ఈ న్యూస్ తెలిస్తే జగన్ ఫుల్ హ్యాపీ !

ఇది కూడా చ‌ద‌వండి===> షాక్ లకే షాక్ ఇది : మోడీ PM పీఠాన్ని కూల్చబోతోన్న మమతా బెనర్జీ !

Advertisement