Chandrababu : తమిళనాడు లో చంద్రబాబు పరువు పోయింది – ఈ న్యూస్ తెలిస్తే జగన్ ఫుల్ హ్యాపీ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu : తమిళనాడు లో చంద్రబాబు పరువు పోయింది – ఈ న్యూస్ తెలిస్తే జగన్ ఫుల్ హ్యాపీ !

 Authored By himanshi | The Telugu News | Updated on :6 May 2021,9:45 pm

Chandrababu : ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే పార్టీ ఓడిపోయి డీఎంకే అధినేత స్టాలిన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నాడు. అన్నాడీఎంకే పార్టీ సీఎం పళ్లనిస్వామిని తమిళనాడు ప్రజలు తిరష్కరించారు. అయినా కూడా తమిళనాట అన్నాడీఎంకే పార్టీ 65 స్థానాలు దక్కించుకున్నాడు. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీ ఖచ్చితంగా మళ్లీ కోలుకోవడం కష్టం అనుకున్నారు. కనీసం పది సీట్లు వచ్చినా చాలా గొప్ప విషయం అన్నారు. కాని అనూహ్యంగా 65 సీట్లను అన్నాడీఎంకే దక్కించుకోవడం హాట్ టాపిక్ గా ఉంది. రాజకీయ అనుభవం అంటూ మాట్లాడే చంద్రబాబు నాయుడు Chandrababu గత ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలయ్యిన విషయం తెల్సిందే.

చంద్రబాబు పరువు పోయే…

Stalin DMK

Stalin DMK

2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో మాత్రం కనీసం 30 సీట్లను కూడా గెలుచుకోలేక ఢీలా పడిపోయాడు. అద్బుతమైన విజయాన్ని జగన్‌ దక్కించుకున్న నేపథ్యంలో ఆయన మళ్లీ మళ్లీ సీఎంగా అవ్వడం ఖాయం అంటున్నారు. చంద్రబాబు నాయుడు పార్టీ తెలుగు దేశం మళ్లీ అధికారంలోకి వచ్చేది అనుమానమే అంటున్నారు. అంత తక్కువ సీట్లు వచ్చిన ఏ పార్టీ అయినా కూడా మళ్లీ అధికారంలోకి వెంటనే రావడం అనేది చాలా అరుదుగా సాగుతుంది. కనుక చంద్రబాబు నాయుడు కూడా అధికారంలోకి వస్తాడా లేదా అనేది అనుమానంగానే ఉంది.

Chandrababu : జగన్‌ ఫ్యాన్స్ ఎద్దేవా..

chandrababu dignity gone in tamilnadu

chandrababu dignity gone in tamilnadu

తెలుగు దేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు తన రాజకీయ అనుభవం గురించి చెప్పుకుంటూ ఉంటాడు. కాని పక్క రాష్ట్రం తమిళనాడులో రాజకీయ అనుభవం లేని పళ్లని స్వామి ఓడిపోయినా కూడా 65 సీట్లను గెలుచుకున్నాడు. అది ఆయన గొప్పతనంగా వారు చెబుతున్నారు. అభివృద్ది చేసిన సీఎం కనుక పళ్లని స్వామికి అక్కడ జనాలు 65 సీట్లు ఇచ్చారు. కాని చంద్రబాబు నాయుడు మాత్రం ఏమాత్రం సత్తా చాటలేక పోయాడు. సీఎం జగన్ మోహన్‌ రెడ్డి పై చంద్రబాబు నాయుడు గెలవలేదు కదా కనీసం పోటీ ఇవ్వలేదు అంటూ జగన్ ఫ్యాన్స్‌ ఎద్దేవ చేస్తున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి==> జగన్ ఏం చేశాడు బొక్క.. చేతులెత్తేశాడు.. వామ్మో… వైసీపీ సీనియర్ నేతల వీడియో లీక్‌..!

ఇది కూడా చ‌ద‌వండి==> వైఎస్ జగన్‌ ఎంత తోపో ఇన్నాళ్ళకి బుద్ధి వచ్చింది సోనియాకి

ఇది కూడా చ‌ద‌వండి==> బాబు ఇప్పటికైనా అచ్చెన్నపై చర్యలు తీసుకుంటాడా…?

ఇది కూడా చ‌ద‌వండి==> జ‌గ‌నన్న చాలా మంచి ప‌ని చేశావ్ కానీ.. రెండు వారాలు ఆల‌స్యం..!

Advertisement
WhatsApp Group Join Now

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది