YS Jagan : వైఎస్ జగన్ తలరాత ఇప్పుడు ఆ జడ్జి గారి చేతిలో?
YS Jagan : ఏపీలో మూడు రాజధానుల అంశం చిలికి చిలికి గాలి వానలా తయారైంది. టీడీపీ హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటించగా.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీంతో అసలు చర్చ స్టార్ట్ అయింది. అసలు ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు ఏంటంటే పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంత రైతులు మూడు రాజధానుల వల్ల నష్టపోతారని.. ఏపీకి ఒక్కటే రాజధాని ఉండాలని నిరసన తెలిపారు. వాళ్లకే మద్దతు ఇస్తూ ఏపీ హైకోర్టు కూడా ఏపీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. రాష్ట్ర రాజధాని విషయంలో చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదని హైకోర్టు తీర్పు చెప్పింది. అంతే కాదు.. ఏపీకి ఒక్కటే రాజధాని ఉంటుందని.. అది అమరావతి మాత్రమేనని.. ఆరు నెలలో రాజధాని పని పూర్తి చేయాలని కూడా ఏపీ హైకోర్టు ఏపీ ప్రభురాష్ట్ర రాజధానిత్వాన్ని ఆదేశించింది.
దీనిపై ఏపీ ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అసలు.. హైకోర్టు తీర్పు శాసన వ్యవస్థ అధికారాలనే నిర్వీర్యం చేసేలా ఉందంటూ ఏపీ ప్రభుత్వం.. తన పిటిషన్ లో పేర్కొంది. మరోవైపు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులపై మరోసారి చర్చ జరిగింది. ఇది వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని ఉపసంహరించుకున్న తర్వాత ఇంకా ఆ చట్టంపై హైకోర్టు తీర్పు ఇవ్వడం ఏంటంటూ ఏపీ సర్కార్.. హైకోర్టు పై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే.
YS Jagan : సుప్రీంకోర్టు తీర్పే ఫైనల్
అయితే.. ఏపీ ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టు తలుపులు తట్టడంతో అసలు సుప్రీం కోర్టు ఏం తీర్పు చెబుతుందా అని అంతా వెయిట్ చేస్తున్నారు. ఇంకో రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఎన్నికలు వచ్చేలోపు మూడు రాజధానుల అంశాన్ని ఎలాగైనా ఒక కొలిక్కి తీసుకురావాలని లేకపోతే.. అది వైసీపీకి తీవ్రమైన నష్టం తీసుకొస్తుందని సీఎం జగన్ భావిస్తున్నారు. ఈనేపథ్యంలో సుప్రీం తీర్పు కోసం ఏపీ ప్రభుత్వం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయలేమని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేయడంతో సుప్రీం ఎలాంటి తీర్పు చెబుతుందోనని వైసీపీ నేతలతో పాటు ఏపీ ప్రజలు కూడా ఆతృతతో ఎదురు చూస్తున్నారు.