Ys Jagan : బెంగాళ్ తరహా ప్లాన్ తో మళ్లీ సీఎం కాబోతున్న వైఎస్ జగన్
Ys Jagan : ఆంధ్రప్రదేశ్లో 2024 సంవత్సరంలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా మరో సారి విజయాన్ని సొంతం చేసుకుంటుందని చాలా మంది బలంగా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగు దేశం పార్టీ చాలా వీక్ అయింది. మరో వైపు జనసేన పార్టీ మరియు బిజెపి కలిసి ముందుకు నడిచిన ప్రయోజనం ఉండక పోవచ్చు. మూడు ప్రతిపక్ష పార్టీలు కలిసి కూటమి గా ఏర్పడితే అప్పుడు సీట్ల పంపకం విషయంలో గొడవలు తప్పవు. కనుక కలిసి పోటీ చేసే విషయమై అనుమానాలు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో వైకాపా కాస్త కష్టపడితే రెండవ సారి అధికారంలోకి రావడం
పెద్ద కష్టమేమి కాదు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ మూడో సారి ముఖ్యమంత్రి అవ్వడం లో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ మరో సారి జగన్మోహన్ రెడ్డికి సలహాలు అందించేందుకు సిద్ధమయ్యారు అని సమాచారం అందుతోంది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఎలాంటి వ్యూహాన్ని అయితే ప్రదర్శించారో ఆంధ్రప్రదేశ్లో వైకాపా కూడా అదే వ్యూహంతో ముందుకు వెళ్లి పోతున్నట్లు గా తెలుస్తోంది.పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా దాదాపుగా 50 శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వడం జరిగింది.

Ys jagan get power for the second time with plan like mamatha benargi
అదే ఫార్ములాను ఆంధ్రప్రదేశ్లో కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి పాటించబోతున్నాడు అనే సమాచారం అందుతోంది. పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు స్థానికంగా తీవ్రమైన అసంతృప్తి ఉంది. వారిని అందరిని పక్కన పెట్టేసే ఉద్దేశం తో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ టీం సర్వేల పేరుతో ఎమ్మెల్యే లకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ ను తీసుకు వస్తుంది. ఆ ప్రోగ్రెస్ రిపోర్టు లో తక్కువ మార్కులు వచ్చిన ఎమ్మెల్యేలను జగన్ మోహన్ రెడ్డి పక్క పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.