Ys Jagan : ఏపీ మంత్రులకు బిగ్ షాక్… ఎవ్వరూ ఊహించని నిర్ణయం తీసుకోబోతున్నసీఎం జగన్
Ys Jagan : త్వరలోనే మంత్రి వర్గ విస్తరణకు.. మొత్తం మంత్రి వర్గాన్నే మార్చేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని.. సమాచారం. వాస్తవానికి సీనియర్లను తన కేబినెట్లో ఉంచుకుని.. మిగిలిన వారిని పక్కన పెడతారని అందరూ అనుకున్నారు. అయితే.. కేబినెట్ కూర్పు.. చేర్పులపై సర్వాధికారాలు… ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ కు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో ఎవరూ ప్రశ్నించే అవకాశం లేదు.
కానీ వాస్తవానికి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ కూడా ఇలా మధ్యంతరంగా.. పూర్తిస్థాయిలో కేబినెట్ ను మార్చిన పరిస్థితి లేకపోవడంతో.. ఇప్పుడు ఆ రికార్డు వైఎస్ జగన్ కే దక్కనుంది. అయితే 2019లో వైసీపీ సర్కారు ఏర్పాటులో అందరూ శక్తి వంచన లేకుండా కృషి చేశారు. అయితే.. కేబినెట్లో సోషల్ ఇంజనీరింగ్ ప్రకారం పదవులు కేటాయించారు. ఇప్పుడు మిగిలిన వారిని సంతృప్తి పరచడం అనే కార్యక్రమంలో భాగంగా.. మరోసారి పూర్తిగా కేబినెట్ ను ప్రక్షాళన చేస్తున్నారు.
ఎంతమందికి ..? Ys Jagan
మరి ఇప్పుడు ఎంత మందిని సంతృప్తి పరుస్తారు? అనేది కీలక ప్రశ్నగా మారింది. ఇప్పుడు కూడా మరో 24 మందికే అవకాశం దక్కనుంది. మరి మిగిలిన అసంతృప్తుల పరిస్థితి ఏమిటి? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా వినిపిస్తోంది. ఎందుకంటే.. చాలా మంది రెడ్డి వర్గం నాయకులే.. ఎక్కువగా పదవులు ఆశిస్తున్నారు. అదేసమయంలో కమ్మ వర్గానికి చెందిన ఒకరిద్దరికి జగన్ మంత్రి పదవుల ఆశ చూపారు. మరి వీరికి అవకాశం ఇస్తారా? అదేసమయంలో తూర్పు గోదావరి నుంచి కూడా చాలా మంది యువ నేతలు చాలా మంది ఎదురు చూస్తున్నారు.
మరి వీరిని సంతృప్తి పరిచేది ఎలా? అన్నదే చర్చనీయాంశంగా మారింది. కేబినెట్ మార్పు కేవలం ఓ రాజకీయ ఎత్తుగడగా చెబుతున్నారు. సంతృప్తి పరుద్దామని.. అసంతృప్తులను బుజ్జగిద్దామని.. వైఎస్ జగన్ కు లేదని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుత మార్పు కూడా కేవలం.. తన హవాను ప్రదర్శించేందుకు.. తన మాట నెగ్గించుకునేందుకు.. తన నాయకత్వాన్ని ప్రొజెక్టు చేసుకునేందుకు ప్రజల్లో పొలిటికల్ సింపతీ పెంచుకునేందుకు వైఎస్ జగన్ చేస్తున్న రాజకీయాల్లో ఒక భాగమని సీనియర్లే పెదవి విరుస్తుండడం ఇప్పుడు వైసీపీలో చర్చకు దారితీస్తుండడం గమనార్హం.