వైఎస్ జగన్ ది బెస్ట్.. దేశంలోనే స్పెషల్ గా ఏపీ
ys Jagan mohan reddy : కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా మృతుల సంఖ్య కూడా ఆందోళనకర స్థితిలో ఉంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సగటుతో పోల్చితే ఏపీలో నమోదు అవుతున్న మృతుల సగటు చాలా తక్కువ ఉంది. ఇప్పటి వరకు ఏపీలో నమోదు అయిన కేసులతో లెక్క వేస్తే మరణాల రేటు అత్యంత స్వల్పం అంటూ విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కరోనా గణాంకాలు కూడా అదే విషయాన్ని చెబుతున్నట్లుగా ఏపీ ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. దేశంలోనే కరోనా మరణాల నియంత్రణ విషయంలో ఏపీ ది బెస్ట్ అంటూ వారు చెబుతున్నారు.
ys Jagan mohan reddy : సీఎం చర్యల వల్లే…
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు మరియు ఆయన ముందు చూపు వల్లే కరోనా మరణాల రేటు చాలా తక్కువగా ఉండటంతో పాటు కేసులు కూడా తక్కువ నమోదు అవుతున్నట్లుగా వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోన కేసులు 10,20,926 నమోదు అయ్యాయి. ఇందులో ఇప్పటి వరకు 9,31,839 మంది కోలుకున్నారు. ప్రస్తుతం వివిద ఆసుపత్రుల్లో మరియు స్వీయ నిర్భందంలో 81,471 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డ వారిలో 92.53 శాతం రికవరీ అవ్వడం ఖచ్చితంగా ప్రభుత్వ చర్యలే కారణం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ys Jagan mohan reddy : ఇతర రాష్ట్రాలతో పోల్చితే..
పక్క రాష్ట్రం తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో కరోనా రికవరీల రేటు చాలా అధికంగా ఉండటం ను గమనించవచ్చు. ఏపీలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న చర్యల వల్లే కేసులు అధికంగా నమోదు అవ్వలేదు అని, అలాగే కరోనా సోకిన వారికి వెంటనే చికిత్స అందించడంతో పాటు అన్ని విధాలుగా ఆదుకోవడం వల్లే మరణాల రేటు తక్కువగా ఉందని అంటున్నారు. ఏపీలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేసిన పక్కా ప్రాణాళికను ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి కరోనాతో పోరాటంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయం సాధించినట్లే అంటున్నారు.