YS Jagan : జగన్ కి భయపడి ఏపీలో కొత్త పొత్తులు పెట్టుకుంటున్న ప్రత్యర్ధులు !
YS Jagan : అసలు వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకుంటున్నారో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే.. ఒకే ఒక్క పార్టీ వైసీపీని ఓడించడం కోసం.. సీఎం కుర్చీ నుంచి జగన్ ను దించడం కోసం ప్రధాన ప్రతిపక్షాలన్నీ తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. దానిలో భాగంగానే అన్ని పార్టీలు ఏకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జనసేన.. బీజేపీతో పొత్తు పెట్టుకుంది. టీడీపీతో కూడా పొత్తు అని ప్రకటించింది. ఈనేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఇంకా జనసేన పార్టీ ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందా అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
టీడీపీ, జనసేన, లెఫ్ట్ పార్టీలన్నీ కూటమి కడుతాయట. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీడీపీ, వామపక్షాలు కలిశాయి. రెండు పార్టీల మధ్య సయోధ్య కూడా కుదిరింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ భావిస్తోంది. అధికార పార్టీ వైసీపీ కూడా ఈ ఎన్నికల్లో గెలుపు కోసం తెగ ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకోవాలని టీడీపీ కూడా ఆశించడం లేదు. బీజేపీ మీద టీడీపీ ఆశలు వదిలేసుకుంది.
YS Jagan : చంద్రబాబుకు ఉన్న ఏకైక దారి జనసేనేనా?
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకి ఉన్న ఏకైక ఆప్షన్ జనసేన. వేరే పార్టీలతో వెళ్లే చాన్స్ లేదు. కాంగ్రెస్ తో గతంలో కలిసి నడవడం వల్లే అది బెడిసికొట్టింది. బీజేపీతో కూడా పొత్తు అయిపోయింది. ఇక మిగిలింది జనసే. ఇప్పుడు వామపక్షాలతో కలిసి వెళ్తున్నా.. ఏపీలో వాటి పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. అందుకే.. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, వామపక్షాలు కలిసి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వర్కవుట్ అయిందంటే ఈ మూడు పార్టీలు కలిసిపోయినట్టే. చూద్దాం మరి ఏం జరుగుతుందో?