Ys Jagan : ఇది జగన్ ప్రభంజనం… ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాన్ స్టాప్ విజయం !
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చాక … రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగరవేసింది. స్థానిక సంస్థల ఎన్నికలలో ఆఖరికి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో సైతం ..వైసీపీ జెండా రెపరెపలాడింది. ఎలక్షన్ ఏదైనా.. జగన్ వెంటే జనం అన్న రీతిలో ఫలితాలు వస్తున్నాయి. దీంతో వచ్చే ఎన్నికలలో వైసీపీ అధినేత జగన్ 175 నియోజకవర్గాలకు 175 టార్గెట్ గా పెట్టుకుని మరీ బరిలోకి దిగుతున్నారు. ఇదే సమయంలో నేతలను ఎప్పుడు
కూడా ప్రజలలో ఉండే రీతిలో రకరకాల టాస్కులు కూడా ఇస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఏపీలో తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం తెలిసిందే. ఈ ఎన్నికలలో కూడా వైసీపీ నాన్ స్టాప్ విజయం అన్నట్టు దూసుకుపోయింది. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీ అభ్యర్థి ఎం.వి.రామచంద్ర రెడ్డి ఘనవిజయం సాధించారు. తూర్పు రాయలసీమ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీ అభ్యర్థి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విజయం సాధించడం జరిగింది. మొత్తం మీద స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్విప్ చేసింది.
మొత్తం తొమ్మిది స్థానాలను కైవసం చేసుకుంది. వీటిలో ఐదు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలు జరిగిన తర్వాత నాలుగు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. మొత్తం మీద చూసుకుంటే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో..వైసీపీ వార్ వన్ సైడ్ అన్నట్టు దూసుకుపోతుంది. దీంతో వైసీపీ క్యాడర్ ఫుల్ జోష్ లో ఉంది. మరోపక్క.. తూర్పు రాయలసీమలో టిడిపి అభ్యర్థి శ్రీకాంత్ ముందంజలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో కొద్దిగా ఈ విషయంలో టీడీపీ పార్టీకీ ఊరటగా ఉన్నట్లు సమాచారం.