Ys Jagan : సంక్షేమ పథకాల క్యాలెండర్..వైయస్ జగన్ కే సాధ్యం ఇది
Ys Jagan : దేశంలో మరెక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమలు పరుస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ విషయం లో జాతీయ స్థాయి మీడియా సంస్థలు కూడా జగన్ ప్రభుత్వానికి వందకు వంద మార్కులు వేస్తున్నారు. జగన్ ప్రభుత్వం నవరత్నాల పేరుతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నభూతో నభవిష్యతి అన్నట్లుగా సాగుతున్నాయి అంటూ దేశ వ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది.రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను పలు రాష్ట్రాల్లో కూడా మోడల్ గా తీసుకుని అమలు చేస్తున్న దాఖలాలు కోకొల్లలుగా ఉన్నాయి.
ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్రంలో పేద వారికి ఎన్నో విధాలుగా అండగా నిలుస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనూహ్యంగా సంక్షేమ పథకాల క్యాలెండర్ను విడుదల చేసి మరో సంచలనానికి తెర తీసింది. దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకోలేదు. ఏ నెలలో ఏ సంక్షేమ పథకాన్నికి ఎన్ని కోట్లు విడుదల చేయబోతున్నాం అనేది ముందుగానే ప్రకటించడం అనేది కేవలం జగన్మోహన్రెడ్డి కే చెల్లింది అంటూ ఆ పార్టీ నాయకులు మరియు ముఖ్య నేతలు చెబుతున్నారు.ఇక సంక్షేమ పథకాల యొక్క క్యాలెండర్ హైలెట్స్ విషయానికి వస్తే అమ్మ ఒడి పథకం ద్వారా 6,500 కోట్ల రూపాయలను జమ చేయబోతున్నారు.
సెప్టెంబర్లో వైయస్సార్ చేయూత ద్వారా 25 లక్షల మంది అక్కా చెల్లెళ్లకు 4,500 కోట్ల రూపాయలు జమ చేస్తారు. జనవరిలో వైయస్సార్ ఆసరా పథకం కింద దాదాపు 70 లక్షల మందికి 6,700 కోట్ల రూపాయలను అందించబోతున్నారు. అదే జనవరిలో వైయస్సార్ పెన్షన్ కానుక ను 2500 నుండి 2750 రూపాయలకు పెంచబోతున్నారు. ఇట్టి కార్యక్రమాలు భవిష్యత్తులో వైయస్ జగన్మోహన్ రెడ్డి పై మరింతగా నమ్మకాన్ని పెంచుతాయి అంటూ ఆ పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా మళ్లీ జగన్ ప్రభుత్వం రావడం ఖాయం అంటూ రాజకీయ విశ్లేషకులు సైతం నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.