Ys Jagan : వైఎస్ జగన్ కి రక్తపు మరకలు అంటించేందుకు రాజకీయ కుట్ర
Ys Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఉన్న అక్కసు తో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు ఆయన తనయుడు వైఎస్ వివేకా హత్య కేసు ని రాజకీయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. మా ఎంపీ అవినాష్ రెడ్డి ని వివేకా హత్య కేసులో ఇరికించేందుకు తెలుగు దేశం పార్టీ నాయకులు సునీత గారిని పావుగా వాడుకుంటున్నారు. ఆమె చంద్రబాబు నాయుడు ఆడుతున్న డ్రామా లో భాగమయ్యారు అంటూ శివ ప్రసాద్ రెడ్డి ఆరోపించారు.
చంద్రబాబు నాయుడు తన రాజకీయ దాహం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి రక్తపు మరకలు అంటించే ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయనకు ఎల్లో మీడియా సహకారం అందిస్తుంది అంటూ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. తన తండ్రి రాజా రెడ్డి ని హత్య చేసిన వారిని సైతం క్షమించిన మహా నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు అయిన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పై ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది.సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఈ కేసులో ఎలాంటి ఆరోపణలు లేకుండా.. సంబంధం లేకుండా బయటకు వస్తారని మాకు నమ్మకం ఉంది.

ys Jagan rachamallu sivaprasad reddy fires chandra babu about viveka case
ఆ సమయంలో ప్రజలే తగిన బుద్ధి మీకు చెబుతారు అంటూ ఎమ్మెల్యే తెలుగు దేశం పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గొప్ప కుటుంబం లో పుట్టిన ఎంపీ అవినాష్ రెడ్డి ని హత్య రాజకీయ నాయకుడిగా చిత్రీకరించేందుకు చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నం విఫలం కావడం ఖాయం.. వివేకా హత్య కేసులో అసలు దోషులు బయటకు వచ్చిన తర్వాత తెలుగు దేశం పార్టీ వారికి ప్రజలు మరియు చట్టం తగిన గుణపాఠం చెప్పాలని కోరుకుంటున్నాను అంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు.