YS Jagan : రాజశ్యామల యాగంలో జగన్.. కోరిక అదే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Jagan : రాజశ్యామల యాగంలో జగన్.. కోరిక అదే..?

YS Jagan : చాలామంది రాజకీయ నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు బాగుండాలని కొన్ని యాగాలు చేస్తుంటారు. అయితే.. చాలామంది రాజ్యాకాంక్ష కోసం, విజయాలను కోరుకునే వారు.. రాజశ్యామల యాగం చేస్తారు. దీంతో వాళ్లకు సర్వం సిద్ధిస్తుంది అని నమ్మకం. చాలామంది రాజశ్యామల యాగాన్ని బలంగా నమ్ముతారు. అప్పట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా రాజశ్యామల యాగం చేసినట్టు అప్పట్లో వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే.. ఇటీవల టీఆర్ఎస్ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :16 December 2022,7:30 pm

YS Jagan : చాలామంది రాజకీయ నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు బాగుండాలని కొన్ని యాగాలు చేస్తుంటారు. అయితే.. చాలామంది రాజ్యాకాంక్ష కోసం, విజయాలను కోరుకునే వారు.. రాజశ్యామల యాగం చేస్తారు. దీంతో వాళ్లకు సర్వం సిద్ధిస్తుంది అని నమ్మకం. చాలామంది రాజశ్యామల యాగాన్ని బలంగా నమ్ముతారు. అప్పట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా రాజశ్యామల యాగం చేసినట్టు అప్పట్లో వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే.

అయితే.. ఇటీవల టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చిన సీఎం కేసీఆర్.. ఢిల్లీలో పార్టీ ఆఫీస్ ప్రారంభం సందర్భంగా అక్కడ రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. అలాగే.. వైజాగ్ లోని శారదా పీఠంలో కూడా సీఎం జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి సారి రాజశ్యామల యాగాన్ని సంవత్సరానికి ఒకసారి నిర్వహిస్తున్నారు. శారదా పీఠంలోనే వార్షికోత్సవాల సందర్భంగా యాగం చేస్తుంటారు. 2023 లో జనవరి 27 నుంచి 31 వరకు రాజశ్యామల యాగం జరుగనుంది. ఈ సారి కూడా సీఎం జగన్ రాజశ్యామల యాగంలో పాల్గొననున్నారు.

ys jagan to participate in rajashyamal yagam in vizag

ys jagan to participate in rajashyamal yagam in vizag

YS Jagan : ముఖ్యమంత్రిని ఆహ్వానించిన శారదాపీఠాదిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి

అయితే.. శారదాపీఠం స్వామీజీ స్వాత్మానందేంద్ర స్వామి.. శారదాపీఠం వార్షికోత్సవాల్లో నిర్వహించే రాజశ్యామల యాగానికి రావాలని ఆహ్వానించారు. తాడేపల్లిలో కలిసి ఆయన్ను ఆహ్వానించారు. కొత్త ఏడాది ప్రారంభంలోనే సీఎం జగన్ రాజశ్యామల యాగంలో పాల్గొని స్వామీజీ ఆశీస్సులు తీసుకోబోతున్నారంటే.. 2023 సంవత్సరం మొత్తం హ్యాపీగా ఉండాలని జగన్ కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం ఎలాగూ సీఎం జగన్.. వైజాగ్ కు పరిపాలన రాజధానిని తరలించాలని భావిస్తున్నారు. ఈనేపథ్యంలో రాజశ్యామల అమ్మ వారి కరుణా కటాక్షాల కోసం సీఎం జగన్ ఈ యాగంలో పాల్గొంటారని తెలుస్తోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది