YS Jagan : డిల్లీకి వైఎస్ జగన్.. అందుకే రాత్రికి రాత్రి అంత పెద్ద నిర్ణయం?
YS Jagan : సీఎం వైఎస్ జగన్ వైజాగ్ పర్యటన రద్దు అయినట్టేనా? విశ్లేషకుల సమాధానం చూస్తే అవుననే అనిపిస్తోంది. నిజానికి శనివారం రోజున వైజాగ్ లో సీఎం జగన్ పర్యటించాల్సి ఉంది. ఆయన షెడ్యూల్ ప్రకారం.. విశాఖపట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనాలి. శారదా పీఠం వార్షికోత్సవాల్లో సీఎం జగన్ పాల్గొనాల్సి ఉంది. చినముషిడివాడకు వెళ్లాలి. అలాగే.. వైజాగ్, అనకాపల్లి ఎంపీ ఇళ్లలో జరిగే పెళ్లి వేడుకకు కూడా సీఎం జగన్ హాజరు కావాల్సి ఉంది. ముఖ్యంగా శారదాపీఠం వార్షికోత్సవంలో శనివారం ఉదయం 9.15 కే ఆయన తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకోవాలి.
అక్కడి నుంచి వైజాగ్ కు విమానాశ్రయంలో బయలుదేరి వెళ్లాల్సి ఉంది. అక్కడి నుంచి చినముషిడివాడకు వెళ్లాలి. కానీ.. రాజశ్యామల యాగానికి హాజరవ్వాల్సి ఉంది. ఆ తర్వాత సాగరమాల కన్వెన్షన్ హాల్ కు చేరుకోవాలి. అయితే.. ఆయన షెడ్యూల్ రద్దు అయినట్టు తెలుస్తోంది. దానికి కారణం.. ప్రధాని మోదీ నుంచి అపాయింట్ మెంట్ వచ్చే అవకాశం ఉన్నదట.
YS Jagan : ఢిల్లీ వెళ్లనున్నారా?
సీఎం జగన్.. ఢిల్లీ వెళ్లేందుకే వైజాగ్ పర్యటనను రద్దు చేసుకున్నారని తెలుస్తోంది. ఢిల్లీ వెళ్లేందుకు వీలుగా ఉండేందుకే ఆయన విశాఖ పర్యటనను రద్దు చేసుకున్నారట. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అపాయింట్ మెంట్ లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చాలా రోజుల నుంచి ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో తాజాగా ఆయనకు ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ దొరికినట్టు తెలుస్తోంది. ఒకవేళ అపాయింట్ మెంట్ ఓకే అయితే ఆయన వెంటనే ఢిల్లీకి వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తోంది.