PM Modi : మోదీ పర్యటన వాయిదా వెనక ఇంత కథ నడిచిందా..?
PM Modi : తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన వాయిదా పడింది. నిజానికి ఈనెల 19న ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఉంది. కానీ.. కొన్ని మార్పుల కారణంగా ఆయన పర్యటనను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. వందే భారత్ ట్రైన్ ప్రారంభోత్సవం కోసం ప్రధాని మోదీ ఈనెల 19 న తెలంగాణ రావాల్సి ఉంది. కానీ… ఆయన షెడ్యూల్ లో పలు మార్పులు చేశారట. అందుకే ఆయన పర్యటనను వాయిదా వేశారట. ఆయన వచ్చినా రాకున్నా.. వందే భారత్ ట్రెయిన్ ను ఈనెల 19న ప్రారంభిస్తారా? లేక దాన్ని కూడా వాయిదా వేస్తారా అనేది తెలియదు.
ప్రధాని మోదీ వందే భారత్ ట్రెయిన్ తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని కేంద్రం చెప్పింది. వందే భారత్ రైలు.. సికింద్రాబాద్ నుంచి వైజాగ్ మధ్య నడవనుంది. ట్రెయిన్ ను ప్రారంభించిన తర్వాత ప్రధాని మోదీ.. పరేడ్ గ్రౌండ్ లో జరిగే భారీ బహిరంగ సభకు హాజరు అవ్వాలి. మరోవైపు ఈసారి ఎన్నికల్లో ప్రధాని మోదీ.. మహబూబ్ నగర్ జిల్లా నుంచి పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
PM Modi : మహబూబ్ నగర్ నుంచి మోదీ పోటీ?
మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం నుంచి మోదీకి ఎంపీగా పోటీ చేయించాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోందట. మహబూబ్ నగర్ నుంచి మోదీని దించి అక్కడ గెలిపించుకొని తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మహబూబ్ నగర్ లో బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని.. వాటినే రాష్ట్రమంతా మార్చుకొని తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పని చేస్తోంది.