YS Jagan : యమా అర్జెంట్ గా ఆ ఊరు బయలుదేరిన వైఎస్ జగన్..!!
YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల ఢిల్లీ పర్యటన చేపట్టడం తెలిసిందే. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సన్నాహక సదస్సులో పెట్టుబడులను ఆకర్షించే విధంగా ప్రసంగించడం జరిగింది. ఈ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విశాఖపట్నం అని క్లారిటీ ఇచ్చి త్వరలో తాను కూడా పూర్తిగా అక్కడికి.. షిఫ్ట్ అవుతున్నట్లు తెలిపారు. దీంతో జగన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. రాజధాని వ్యవహారం సుప్రీంకోర్టులో ఉండగా ఈ రీతిగా ముఖ్యమంత్రి మాట్లాడటం తగ్గదు అనీ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఎందుకంటే మొదటి నుంచి ప్రతిపక్షాలు అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉంచాలని కోరుతున్నారు.
కానీ విశాఖపట్నం విషయంలో మొదటి నుండి వైయస్ జగన్ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. పెద్దగా ఖర్చు పెట్టకుండా కొద్దిపాటి ఖర్చుతో విశాఖపట్నంనీ రాజధానిగా తీర్చిదిద్దవచ్చని చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉంటే విశాఖపట్నంలో భవనాల విషయంలో పెద్ద సమస్య ఏమీ లేదని.. అక్కడ ప్రభుత్వ భవనాలు మరియు ఐటి బిల్డింగ్స్ చాలా ఖాళీగా ఉన్నాయని ఇటీవల వైవి సుబ్బారెడ్డి తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ కి తగిన భవనాలు. అందువల్ల న్యాయపరమైన అవరోధాలు తీరిపోగానే విశాఖకు రాజధాని ఏ క్షణమైనా షిఫ్ట్ అవుతుంది
అని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. పరిస్థితి ఇలా ఉండగా ఉగాది ముహూర్తంగా సీఎం క్యాంప్ ఆఫీస్ కార్యాలయం ప్రారంభించడానికి సీఎం జగన్ డిసైడ్ అయ్యారంట. దీంతో విశాఖలో ఉన్న భవనాలను మరియు బిల్డింగ్స్ మొత్తం స్వయంగా పరిశీలించడానికి జగన్ ఎమ అర్జెంటుగా ఇప్పుడు వైజాగ్ బయలుదేరినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు సీఎం క్యాంప్ ఆఫీస్ తో పాటు జగన్ గృహప్రవేశం కూడా ఉగాది రోజు నాడు జరగనుందని సమాచారం. ఆ తర్వాత కొద్ది నెలలకు వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి నుండి వైజాగ్ కీ షిఫ్ట్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.