YS Sharmila : వైఎస్ షర్మిలని అరెస్ట్ చేయడం వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం ఇదే?
YS Sharmila : తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలి అనే పట్టుదలతో వైఎస్ షర్మిల ఉన్నారు. ఇంకో 10 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు రానున్నాయి. ఈనేపథ్యంలో తెలంగాణలో అధికారంలోకి వచ్చి వైఎస్సార్ రాజ్యాన్ని తీసుకొస్తానని తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తున్నారు వైఎస్ షర్మిల. దాని కోసమే.. ఆమె తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర ప్రారంభించారు. కానీ.. అడుగడుగునా షర్మిల పాదయాత్రకు తెలంగాణ పోలీసులు అడ్డు తగులుతున్నారు. ఇదివరకు నర్సంపేటలో తన పాదయాత్రను అడ్డుకున్నారు పోలీసులు.
మళ్లీ అనుమతి తీసుకొని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పాదయాత్రను కొనసాగిస్తున్న షర్మిలకు తాజాగా మహబూబాబాద్ జిల్లాలో పోలీసులు మరోసారి షాకిచ్చారు.వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు. వైఎస్ షర్మిలను మరోసారి పోలీసులు అడ్డుకోవడంతో ఆమె అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో పాదయాత్రలో ఉన్న షర్మిల.. మహబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై విమర్శలు చేశారని ఆమెకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆంధ్రా నుంచి కొందరు కొజ్జాల్లా కనిపించే వలస వాదులు అంటూ శంకర్ నాయక్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
YS Sharmila : శంకర్ నాయక్ వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల సీరియస్
నీలాంటి తాటాకు చప్పుళ్లకు వైఎస్సార్ బిడ్డ బయపడదు.. అంటూ శంకర్ నాయక్ కు గట్టి రిప్లయి ఇచ్చింది షర్మిల. దీంతో శంకర్ నాయక్ అనుచరులు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు వైఎస్ షర్మిల బస చేసిన ప్రాంతానికి వచ్చి నినాదాలు చేశారు. దీంతో అక్కడ గొడవలు జరగకుండా పోలీసులు వెళ్లి షర్మిలకు నోటీసులు జారీ చేసి అరెస్ట్ చేశారు. ఆమెను వెంటనే హైదరాబాద్ కు తరలించారు. అయితే.. కావాలని వైఎస్ షర్మిలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆమెను అరెస్ట్ చేయించాలనేది బీఆర్ఎస్ హైకమాండ్ ఉద్దేశం అని వైఎస్సార్టీపీ అభిమానులు అంటున్నారు.