YS Sharmila : కల్లు తాగిన షర్మిల.. కొంచెం తాగి ఏం చేసిందో చూడండి.. వీడియో వైరల్

Authored By Breaking News 2 | The Telugu News | Published on: February 15, 2023, 6:00 pm

YS Sharmila : తెలంగాణ అంటేనే మనకు గుర్తొచ్చేది కల్లు. అవును.. తెలంగాణ ప్రాంతంలో ఎక్కడికి వెళ్లినా కల్లు కనిపిస్తుంది. తాజాగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కల్లు తాగారు. ఆమె ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. జనగాం జిల్లా నుంచి పాలకుర్తి నియోజకవర్గంలో ఆమె పాదయాత్ర కొనసాగుతోంది. ఈసందర్భంగా ఆమె పాలకుర్తి నియోజకవర్గంలోని గ్రామాల్లో పాదయాత్ర చేస్తూ అక్కడి

YS Sharmila drinks toddy in Palakurthy video viral

YS Sharmila drinks toddy in Palakurthy video viral

ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు కదులుతున్నారు.ఈనేపథ్యంలో లక్ష్మీనారాయణపురం స్టేజీ వద్ద ఓ గీత కార్మికుడు షర్మిలకు కల్లు పోశారు. షర్మిల ముందు వద్దని చెప్పినా.. తాగండి మేడమ్.. మీకోసమే తాడు ఎక్కాడు. మంచి కల్లు. ఉదయం కల్లు.. నీరా బాగుంటుంది. తియ్యగా ఉంటుంది అని చెప్పడంతో గీత కార్మికుడి కోరిక మేరకు.. షర్మిల కల్లు రుచి చూశారు. కల్లు రుచి చూసిన షర్మిల.. బాగుందని చెప్పి మరోసారి రుచి చూశారు.

YS Sharmila drinks toddy in Palakurthy video viral

YS Sharmila drinks toddy in Palakurthy video viral

YS Sharmila : తియ్యగుందని మరోసారి రుచి చూసిన షర్మిల

అలా రెండు మూడు సిప్స్ తాగి కల్లు బాగుందని గీత కార్మికుడిని మెచ్చుకున్నారు. ఇంకొంచెం తాగండి మేడమ్ అంటే.. వద్దులే ఇక చాలు అని చెప్పారు షర్మిల. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. వారెవ్వా.. షర్మిలక్క సూపర్ అంటున్నారు. కల్లు తాగిన తర్వాత కల్లు గీత కార్మికులకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చాక పెద్ద పీట వేస్తామని ఆమె ఈసందర్భంగా హామీ ఇచ్చారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp