YS Sharmila : ముఖంపై దెబ్బలు.. పోలీసులు ఈడ్చుకెళ్ళారంటు… షర్మిల సీరియస్ వీడియో వైరల్..!!
YS Sharmila : వైఎస్సార్‌టీపీ అధ్యక్షరాలు వైఎస్ షర్మిల చేస్తున్నాను ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఉదృతలకు దారితీస్తుంది. నర్సంపేట నియోజకవర్గంలో షర్మిల పాదయాత్రకు అడుగడుగునా ఆటంకాలు ఏర్పడ్డాయి. విషయంలోకి వెళ్తే నర్సంపేట ఎమ్మెల్యే పై షర్మిల చేసిన వ్యాఖ్యల పట్ల టిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. అంతేకాకుండా షర్మిల చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో టిఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరావడంతో..
ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వైఎస్ షర్మిల అని అరెస్టు చేసి హైదరాబాద్ కి తరలించారు. అరెస్టు సమయంలో షర్మిల పెదంపై గడ్డం దగ్గర బలమైన గాయం అయింది. పోలీసులనుచితంగా మరీ దారుణంగా వ్యానులోకి ఈడ్చికేలడం జరిగింది. దీంతో ఆమె చేస్తున్న పాదయాత్రకి బ్రేక్ పడినట్లు అయింది. అరెస్టు అనంతరం అధికార పార్టీపై వైయస్ షర్మిల సీరియస్ వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటివరకు చేసిన పాదయాత్రలో ఎప్పుడు ఇటువంటి దారుణమైన పరిస్థితి ఎదురుకోలేదు అని అన్నారు. పోలీసులు కేసీఆర్ కి జీతగాలిలాగా మారారని మండిపడ్డారు.
ఇంకా టిఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు రౌడీలు మరియు కొండలు లాగా ప్రవర్తిస్తున్నారు తమ వాహనాలు నిప్పులు పెట్టిన వీడియోలు చూపించిన గాని వాళ్ళని అరెస్టు చేయకుండా.. తనని అరెస్టు చేసి ఈడ్చి కెళ్ళి వ్యాన్ లో పడేసారని.. ఆ సమయంలో తనకు గాయాలు కూడా అయ్యాయని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. శాంతిభద్రతల సమస్య అంటూ తన పాదయాత్ర అడ్డుకుంటున్నారని.. అయినా కానీ పాదయాత్ర కొనసాగిస్తానని హెచ్చరించారు. షర్మిలనీ ఈడ్చికెళ్లిన సమయంలో.. ఆమె ముఖానికి గాయాలు అయినా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://twitter.com/i/status/1597283504957849601