YS Sharmila : ఆరోజే వైఎస్ షర్మిల పార్టీ ప్రకటన?
YS Sharmila : తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టబోతున్నారు.. అనే వార్తలు వచ్చినప్పుడు అందరూ నవ్వారు. వైఎస్ షర్మిల ఏంది? తెలంగాణలో పార్టీ పెట్టడం ఏంది? అని అంతా అబద్ధం అనుకున్నారు కానీ.. షర్మిల నిజంగానే పార్టీ పెడుతున్నానంటూ ప్రకటించడంతో.. అంతా విస్తుపోయారు. ఎందుకంటే.. తను పార్టీ పెట్టేది ఏపీలో కాదు.. తెలంగాణలో. వైఎస్సార్ అభిమానులు తెలంగాణలో కూడా ఉన్నారని.. తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యంగా పార్టీ పెడుతున్నానంటూ షర్మిల ప్రకటించారు. దీంతో తెలంగాణలో ఉన్న మిగితా రాజకీయ పార్టీలు వెంటనే అలర్ట్ అయ్యాయి. షర్మిల పార్టీ పెడితే.. తమ పార్టీ నుంచి ఎవ్వరూ బయటికి వెళ్లకూడదని ముందుగానే అన్ని ప్రణాళికలు రచిస్తున్నారు.
అయితే.. షర్మిల తెలంగాణలో ఎప్పుడు పార్టీ పెడుతారు.. అనేదానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. పార్టీ పేరును, జెండా, అజెండాను షర్మిల త్వరలో ప్రకటిస్తారని చెప్పినా.. ఏరోజు తను పార్టీని ప్రకటిస్తారో అన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు.
తాజా సమాచారం ప్రకారం.. వైఎస్ అభిమానులతో, ఇతర నేతలతో షర్మిల పార్టీ ఆవిర్భావ తేదీపై చర్చలు జరుపుతున్నారట. ఏరోజైతే బాగుంటుందని.. వైఎస్ అభిమానులను అడిగి తెలుసుకుంటున్నారట.
YS Sharmila : వైఎస్సార్ జయంతి రోజున లేదంటే వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున?
అయితే.. వైఎస్ షర్మిల.. తన తండ్రి బాటలోనే నడవాలని అనుకుంటున్నారు కాబట్టి.. తన తండ్రి డైరీలో ఉన్న ప్రత్యేకమైన తేదీలనే ఆమె ఎంచుకోనున్నట్టు తెలుస్తోంది. మే 14 వ తారఖున లేదంటే జులై 8న షర్మిల పార్టీని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఎందుకంటే.. మే 14న వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆరోజు అయితే బెటర్ అని ఆమె భావిస్తున్నారట. ఒకవేళ మే 14న కుదరకపోతే.. జులై 8న ఆయన జయంతి రోజున పార్టీని ప్రకటించేందుకు షర్మిల సమాయత్తమవుతున్నారట.
అదే రోజు.. పార్టీ పేరుతో పాటు పార్టీ జెండా, అజెండా, విధివిధానాలు.. అన్నింటినీ షర్మిల ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.